F 3 : వెంకీ, వరుణ్ తేజ్‌‌ల మల్టీస్టారర్ ప్రిరిలీజ్ బిజినెస్ వివరాలివే ! అనిల్ రావిపూడి కామెడీ మ్యాజిక్ అదిరింది !

Updated on May 25, 2022 06:42 PM IST
ఈ చిత్రంలో విక్టరీ వెంకేటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ కథానాయికలుగా నటించారు. అలాగే నటి సోనాల్ చౌహాన్ కూడా ఓ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం.
ఈ చిత్రంలో విక్టరీ వెంకేటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ కథానాయికలుగా నటించారు. అలాగే నటి సోనాల్ చౌహాన్ కూడా ఓ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం.

అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన చిత్రం "F 3". వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం "F 2"  చిత్రానికి  సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.  2019 లో సంక్రాంతి సినిమాగా పెద్ద అంచనాలు లేకుండా విడుదలైన "F 2" , బ్లాక్ బస్టర్‌గా నిలిచి పరిశ్రమను ఆశ్చర్యపరిచింది.  

ముఖ్యంగా వెంకటేష్ చేసిన సిట్యువేషనల్ కామెడీ, ఈ చిత్రానికి హైలెట్‌గా నిలిచింది. వెంకీ పాత్రకు సమాంతరంగా ప్రయాణించిన వరుణ్ తేజ్ పాత్ర కూడా సినిమాకి ప్లస్ పాయింటే అయ్యింది

పెద్ద అంచనాలు లేకుండా విడుదలైన ఆ చిత్రం రూ.130 కోట్లకు పైగా గ్రాస్‌తో పాటు.. రూ.80 కోట్ల షేర్ సాధించి పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. నిర్మాతగా దిల్ రాజు కూడా ఖుషీ అయ్యారు. ప్రస్తుతం "F 3" సినిమా కూడా భారీ లాభాలే తీసుకొస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు

వరసగా ఐదు సూపర్ హిట్ సినిమాల తర్వాత, డబుల్ హ్యాట్రిక్ కోసం వేచి చేస్తున్నారు "F 3" సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. అలాగే విడుదల చేసిన మూడు పాటలూ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. 

ఈ చిత్రంలో విక్టరీ వెంకేటేష్ (Venkatesh) సరసన తమన్నా, వరుణ్ తేజ్ (Varun Tej) సరసన మెహ్రీన్ కౌర్ కథానాయికలుగా నటించారు. అలాగే నటి సోనాల్ చౌహాన్ కూడా ఓ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. ఇక ఓ ప్రత్యేక గీతంలో పూజా హెగ్డే నటించింది. తాజాగా ఈ సినిమాను అమెరికాలో 350 స్క్రీన్స్‌‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రైమ్ మీడియా యూఎస్ సంస్థ అక్కడి పంపిణీ హక్కులను చేజెక్కించుకుంది.  ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్‌ను ఓసారి పరిశీలిద్దాం

నైజాం (తెలంగాణ):  రూ. 18 కోట్లు, సీడెడ్ (రాయలసీమ): రూ. 8.40 కోట్లు, ఉత్తరాంధ్ర: రూ. 7 కోట్లు, తూర్పు: రూ. 4.50 కోట్లు, పశ్చిమం: రూ. 4 కోట్లు, గుంటూరు: రూ. 5 కోట్లు, కృష్ణా : రూ.4.50 కోట్లు, నెల్లూరు: రూ. 2.4 కోట్లు                                                                                  

తెలంగాణ, ఆంధ్ర  మొత్తం ప్రిరిలీజ్ బిజినెస్ - రూ. 53.80 కోట్లు

కర్ణాటక: రూ. 3.40 కోట్లు,  ఓవర్సీస్: రూ. 5.20 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 1.20 కోట్లు                                                                                                                                                                            

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!