ఎన్టీఆర్‌‌ (Junior NTR) డైరెక్టర్ కొరటాల శివను పక్కన పెట్టారా! తర్వాత సినిమాను ‘ఉప్పెన’ బుచ్చిబాబుతో చేస్తారా?

Updated on Sep 03, 2022 01:46 PM IST
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా రిలీజై చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎన్టీఆర్‌‌ (Junior NTR) మరో సినిమా స్టార్ట్ చేయలేదు
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా రిలీజై చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎన్టీఆర్‌‌ (Junior NTR) మరో సినిమా స్టార్ట్ చేయలేదు

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా ఇచ్చిన కిక్‌తో మాంచి జోష్‌ మీద ఉన్నారు జూనియర్‌‌ ఎన్టీఆర్ (Junior NTR). ఆ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజై ఘన విజయం సాధించింది. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలో ఎన్టీఆర్‌‌ నటనకుగాను విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ముఖ్యంగా రాంచరణ్, ఎన్టీఆర్‌‌ నటించిన కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్‌‌ హావభావాలకు సినీ ప్రేమికులు, తారక్ అభిమానులు ఫిదా అయిపోయారు.

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా రిలీజై చాలా రోజులు గడిచింది. అయితే ఇప్పటివరకు మరో సినిమా స్టార్ట్ చేయలేదు ఎన్టీఆర్. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఈనెలలో స్టార్ అవుతుంది.. వచ్చే నెలలో మొదలవుతుంది అంటూనే నెలలు గడిచిపోతున్నాయి తప్ప, ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ మీదకు వెళ్లడంలేదు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొరటాల శివతో సినిమాని ఎన్టీఆర్ ప్రస్తుతం పక్కన పెట్టేశారని తెలుస్తోంది.

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా రిలీజై చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎన్టీఆర్‌‌ (Junior NTR) మరో సినిమా స్టార్ట్ చేయలేదు

‘ఉప్పెన’ బుచ్చిబాబుతో..

'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయాల్సి వుంది. ముందుగా బుచ్చిబాబు సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయమై అధికారికంగా ప్రకటన వెలువడే చాన్స్ ఉందని సమాచారం. బుచ్చిబాబు – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారని అంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ – 'కేజీఎఫ్' ఫేం ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'ఆచార్య' సినిమా ఫలితం తేడా కొట్టడం వలనే, కొరటాల శివ – ఎన్టీఆర్ (Junior NTR) ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

Read More : Junior NTR: అమిత్ షాను (Amit Shah) కలిసిన ఎన్టీఆర్.. గంటపాటు భేటీ.. ప్రస్తుత రాజకీయాలపై చర్చ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!