Junior NTR: అమిత్ షాను (Amit Shah) కలిసిన ఎన్టీఆర్.. గంటపాటు భేటీ.. ప్రస్తుత రాజకీయాలపై చర్చ?

Published on Aug 23, 2022 01:23 PM IST

'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాతో టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (NTR) మ‌రింత పాపుల‌ర్ అయ్యారు. కొమురం భీముడుగా ఎన్టీఆర్ న‌ట‌న అద్భుతం అంటూ సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు ప్ర‌శంసిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హీరో ఎన్టీఆర్‌ను క‌ల‌ిశారు.  

హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్ లో ఆదివారం (ఆగస్టు 21) రాత్రి గం.10.30ని.ల సమయంలో అమిత్ షా-ఎన్టీఆర్ (Amit Shah-NTR) భేటీ జరిగింది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ భేటీ జరగ్గా.. 20 నిమిషాల పాటు ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. భేటీ సందర్భంగా ఎన్టీఆర్.. అమిత్ షాను మర్యాదపూర్వకంగా పుష్ప గుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు. 

ఇక, భేటీ అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో (Bandi Sanjay) కలిసి ఇద్దరు భోజనం చేశారు. ఇదిలా ఉంటే.. అమిత్ షా-ఎన్టీఆర్ మధ్య జరిగిన అనూహ్య భేటీ చాలామందిని ఆశ్చర్యపరిచింది.

కాగా, ప్రతీ సంవత్సరం ఆస్కార్ అవార్డులను (Oscar Awards) ప్రెడిక్ట్ చేసే 'వెరైటీ' అనే సంస్థ, ఇటీవలే రిలీజ్ చేసిన ఉత్తమ నటుల జాబితాలో ఎన్టీఆర్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. ఇదే ఓ సంచ‌ల‌నం అయితే... ఇప్పుడు అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ మ‌రో సంచ‌ల‌నంగా మారింది.  

Read More: NTR-Amit Shah: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసిన జూనియర్ ఎన్టీఆర్.. ఫొటోలు వైరల్!