ఆహా (Aha)లో స్ట్రీమింగ్‌ కానున్న ‘డ్యాన్స్ ఐకాన్‌’ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్..డిఫరెంట్ షో అని చెప్తున్న ఓంకార్

Updated on Aug 22, 2022 07:03 PM IST
ఓంకార్ ఇప్పటికే చాలా డ్యాన్స్‌ షోలకు యాంకర్‌‌గా వ్యవహరించారు. డ్యాన్స్‌  ఐకాన్ షోతో ఆహా (Aha) ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నారు
ఓంకార్ ఇప్పటికే చాలా డ్యాన్స్‌ షోలకు యాంకర్‌‌గా వ్యవహరించారు. డ్యాన్స్‌ ఐకాన్ షోతో ఆహా (Aha) ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నారు

కరోనా తర్వాత ఓటీటీల వినియోగం పెరిగింది. వెబ్‌ సిరీస్‌, సినిమాలు, స్పెషల్‌ షోలతో ఓటీటీలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తెలుగువారికి నచ్చే కంటెంట్‌ను అందిస్తూ ఆహా (Aha) ఓటీటీల సామ్రాజ్యంలో దూసుకుపోతోంది.  తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాంగా తెరపైకి వచ్చిన ఆహా.. కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌, టాక్‌ షో, సింగింగ్‌ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇప్పుడు మరో కొత్త షోను డిజిటల్‌ ప్రేక్షక్షుల ముందుకు తీసుకువస్తోంది ఆహా. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన డ్యాన్సర్ల కోసం డ్యాన్స్‌ ఐకాన్‌ షోను తెరపైకి తెచ్చింది. త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ షోకు యాంకర్‌ ఓంకార్‌ హోస్ట్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఓంకార్ ఇప్పటికే చాలా డ్యాన్స్‌ షోలకు యాంకర్‌‌గా వ్యవహరించారు. డ్యాన్స్‌  ఐకాన్ షోతో ఆహా (Aha) ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నారు

డిఫరెంట్ డ్యాన్స్‌ షో..

త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్న డ్యాన్స్‌ ఐకాన్ షో ఫస్ట్‌లుక్‌ ఆగస్టు 20న ‘ఆహా’ విడుదల చేసింది. ఈ క్రమంలో ఈ షో యాంకర్, ప్రొడ్యూసర్‌ ఓంకార్ మాట్లాడుతూ.. ‘ఈ షో ద్వారా నేను ఓటీటీకి ప్లాట్‌ఫాంలోకి అడుగుపెడుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ఆహాకు ధన్యవాదాలు. నేను ఎన్నో డ్యాన్స్ షోస్ చేశాను, కానీ ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

ఈ షో.. కంటెస్టెంట్స్‌తో పాటు కొరియోగ్రఫీ చేసే మాస్టర్స్ జీవితాలని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్‌కు టాలీవుడ్‌లో ఒక పెద్ద హీరో సినిమాలో కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. ఆహాలో (Aha) స్ట్రీమింగ్‌ కాబోతున్న ఈ షోను అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు ఓంకార్.

Read More : ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ సీజన్‌ 2పై ఆహా (Aha) క్లారిటీ.. గెస్ట్‌లు ఎవరో కామెంట్‌ చేయాలని ట్వీట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!