చంద్రముఖి సినిమా సెట్స్‌లో ఎంజాయ్ చేస్తున్న రాఘవ లారెన్స్ (Raghava Lawrence), రాధిక, వడివేలు.. వీడియో వైరల్

Updated on Aug 13, 2022 09:41 PM IST
చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చంద్రముఖి2 సినిమాలో రాఘవ లారెన్స్ (Raghava Lawrence)
చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చంద్రముఖి2 సినిమాలో రాఘవ లారెన్స్ (Raghava Lawrence)

డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'చంద్రముఖి-2'. సూపర్‌‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పి.వాసు దర్శకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా చంద్రముఖి సినిమాపై పలు ఆసక్తికర అప్‌డేట్స్‌ బయటకు వస్తున్నాయి.

రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన చంద్రముఖి సినిమా ఆయన కెరీర్‌‌లో మంచి సినిమాగా నిలిచింది.ఈ సినిమాకు సీక్వెల్‌గా చంద్రముఖి2ను రజినీ హీరోగా తెరకెక్కించాలని డైరెక్టర్ పి.వాసు, చిత్ర యూనిట్ చాలాకాలంగా ఎదురుచూసింది. అయితే పలు కారణాలతో చంద్రముఖి2 ప్రాజెక్ట్‌లో రజినీకాంత్‌ స్థానంలో రాఘవ లారెన్స్‌ కీలకపాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. 

గతంలో పి.వాసు, రాఘవ లారెన్స్ కాంబినేషన్‌లో వచ్చిన 'శివలింగ' సినిమా మంచి హిట్‌ సాధించింది, దాంతో రజినీ స్థానంలో లారెన్స్‌తో చంద్రముఖి2 సినిమాను తెరకెక్కిస్తున్నారు పి.వాసు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ సమయంలో లారెన్స్.. రజినీ దగ్గరకు వెళ్లి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. చంద్రముఖి2 సినిమా షూటింగ్ ఫస్ట్‌ షెడ్యూల్‌ను మైసూర్‌‌లో ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. అనుకున్నట్టుగానే షూటింగ్ స్టార్ట్ చేసి లారెన్స్‌తోపాటు పలువురిపై కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించారు.

చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చంద్రముఖి2 సినిమాలో రాఘవ లారెన్స్ (Raghava Lawrence), రాధిక, వడివేలు

ఫస్ట్ షెడ్యూల్ ముగిసినట్టు వెల్లడి

ఇటీవల తీసిన సన్నివేశాలతో చంద్రముఖి2 సినిమాకు సంబంధించిన మేజర్ షెడ్యూల్‌ ముగిసిందని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధిక, వడివేలుతోపాటు అయిదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ హీరోయిన్లతో ఎవరు చంద్రముఖి క్యారెక్టర్ పోషిస్తున్నారనే విషయం ప్రస్తుతానికి సస్సెన్స్‌.

కాగా, చంద్రముఖి సినిమా సెట్స్‌లో వడివేలు, లారెన్స్ (Raghava Lawrence), రాధిక సరదాగా మాట్లాడుకుంటున్న వీడియోను ట్విట్టర్‌‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న చంద్రముఖి సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2023 వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని టాక్.

Read More : Chandramukhi Sequel: 'చంద్రముఖి 2' లో హీరోగా రాఘవ లారెన్స్ (Raghava Lawrence) .. ఏకంగా 5 మంది హీరోయిన్లు?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!