న‌ష్టాల‌తో ఓటీటీలో.. ముందే రిలీజ్‌కు సిద్ధం అవుతున్న‌ఆచార్య (Acharya) 

Updated on May 04, 2022 07:44 PM IST
ఆచార్య(Acharya)  సినిమాకు అనుకున్నంత ఆద‌ర‌ణ ప్రేక్ష‌కులు ఇవ్వ‌లేదు. రిలీజ్ త‌ర్వాత ఆచార్య సినిమాపై నెగిటీవ్ టాక్ ప్రేక్ష‌కుల్లోకి బాగా వెళ్లింది
ఆచార్య(Acharya)  సినిమాకు అనుకున్నంత ఆద‌ర‌ణ ప్రేక్ష‌కులు ఇవ్వ‌లేదు. రిలీజ్ త‌ర్వాత ఆచార్య సినిమాపై నెగిటీవ్ టాక్ ప్రేక్ష‌కుల్లోకి బాగా వెళ్లింది

ఆచార్య.. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన చిరంజీవి సినిమా. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాల తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా. వరుస హిట్లతో మంచి ఊపు మీదున్న దర్శకుడు కొరటాల శివ, ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దీంతో అభిమానులు ఎన్నో ఆశలతో.. కళ్లు కాయలు కాసేలా, ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూశారు. కానీ సినిమా విడుదల అయ్యాక మాత్రం ఫలితం వేరేగా వచ్చింది. 

ఈ మధ్యకాలంలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అన్నీ దాదాపు హిట్ సినిమాలే. కానీ ఆచార్య (Acharya) సినిమా మాత్రం డిజాస్ట‌ర్‌గా మిగిలింది. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లకు భారీ న‌ష్టాల‌ను మిగిల్చింది. ఆచార్య సినిమాతో న‌ష్ట‌పోయిన వాళ్ల‌ను ఆదుకునేందుకు, నిర్మాతలు ఇప్పటికే కొత్త ఐడియాల‌తో ముందుకు వెళ్తున్నారు. 

 

Acharya Movie Still

ఆచార్య(Acharya)  సినిమాకు  ప్రేక్షకులలో అనుకున్నంత ఆదరణ లభించలేదు. విడుదల త‌ర్వాత ఆచార్య సినిమాపై నెగిటివ్ టాక్ ప్రేక్ష‌కుల్లోకి బాగా వెళ్లింది. దీంతో థియేట‌ర్ల‌కు వ‌చ్చే ఆడియ‌న్స్ త‌గ్గిపోయారు. ఆచార్య సినిమాతో ప్రొడ్యూస‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు చాలా న‌ష్ట‌పోయారు. ఆ న‌ష్టాల‌ను ఎలాగైనా పూడ్చాల‌ని అనుకుంటున్నారు. దీంతో, ఈ సినిమాను చెప్పిన తేదీ కంటే రెండు వారాలు ముందుగానే అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు. అనుకున్న టైం క‌న్నా ముందే రిలీజ్ చేస్తే.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ నిర్మాత‌ల‌కు భారీ మొత్తం చెల్లిస్తుంది. అంటే ఎర్లీ విండో ప్రాసెస్ అన్న మాట. ఈ మాదిరి రిలీజ్‌ కోసమే ఆచార్య సిద్ధం అవుతుంది. 

Acharya Movie Still

ఇటీవలి కాలంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా కూడా, నిర్మాతలకు న‌ష్టాల‌ను మిగ‌ల్చ‌డంతో అమెజాన్‌లో ముందే రిలీజ్ చేశారు. రెండు వారాలు ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా చేశారు. ఇలా ముందుగా రిలీజ్ చేసినందుకు రాధేశ్యామ్ నిర్మాత‌ల‌కు రూ.25 కోట్లను అమెజాన్ యాజమాన్యం అద‌నంగా చెల్లించారు. ఆచార్య చిత్రాన్ని కూడా ఇదే ప‌ద్ధ‌తిలో ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు యోచిస్తున్నారు.

 

Acharya

ఆచార్య విషయానికి వస్తే, రిలీజ్ అయిన నాలుగు వారాల త‌ర్వాత అమెజాన్‌లో రిలీజ్ చేయాల‌ని నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. కానీ థియేటర్లలో ఆచార్య ప‌రిస్థితి చూసి, రెండు వారాల‌కే ఓటీటీలో వ‌చ్చేలా చేయాల‌ని నిర్మాతలు చూస్తున్నారు. మే చివ‌రి వారంలో కానీ, జూన్ మొద‌టి వారంలో కానీ, ఓటీటీలో ఆచార్య చిత్రాన్ని విడుద‌ల చేయనున్నారట. ఈమేరకు అమెజాన్ నుండి ఓ ప్రకటన విడుదల అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి, మే రెండో వారంలోనే ఆచార్య రిలీజ్ ఉంటుంద‌ని భావిస్తున్నారు. దీంతో అమెజాన్‌లో త్వ‌ర‌లోనే ఆచార్య (Acharya) సినిమాను చూసేందుకు మెగా అభిమానులు సిద్ధ‌మ‌వుతున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!