చిరంజీవి(Chiranjeevi) కొత్త సినిమా టైటిల్ రిలీజ్

Updated on May 01, 2022 06:20 PM IST
Chiranjeevi: ఆచార్య త‌ర్వాత చిరంజీవి వరుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారా?. కొత్త సినిమా టైటిల్ కూడా వ‌చ్చేసింది. 154వ చిరంజీవి సినిమాకి ఎవ‌రి డైరెక్ష‌న్.. ఏంటా టైటిల్?,

చిరంజీవి(Chiranjeevi) ఆచార్య సినిమాతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఆచార్య త‌ర్వాత వ‌చ్చే సినిమాల వివ‌రాలు కూడా రిలీజ్ చేసేస్తున్నారు. చిరంజీవి వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కులకు వినోదం పంచాల‌ని ప్లాన్ చేశారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా 154 సినిమాలు ప్ర‌స్తుతం చిరంజీవి చేస్తున్నారు. 

గాడ్ ఫాదర్, భోళా శంకర్, Mega 154 సినిమాల‌ను శ‌ర‌వేగంగా తెర‌కెక్కించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. కొత్త సినిమా టైటిల్ చెప్పి చిరంజీవి మెగా అభిమానులను ఖుషీ చేశారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగా 154వ సినిమా చేస్తున్నారు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వాల్తేరు వీరయ్య అని చెప్పారు.శేఖర్ మాస్టర్ రివీల్ చేయడంతో కన్ఫమ్ అయ్యింది.
చిరంజీవి కూడా వాల్తేరు వీర‌య్య అని చెప్పేశారు. దీంతో టైటిల్ రిలీజ్ అవ‌డంతో అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు

Chiranjeevi

మెగా 154 సినిమా ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సముద్రంలోకి బోట్‌లో చేపల వేటకి వెళ్తున్న చిరంజీవి బ్యాక్‌ సైడ్ లుక్‌తో పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. చిరంజీవికి జోడిగా శృతి హాస‌న్ న‌టిస్తున్నారు.

గాడ్ ఫాద‌ర్ సినిమాలో చిరంజీవి, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గాడ్ ఫాద‌ర్ సినిమాని మోహన్‌రాజా డైరెక్ట్ చేస్తున్నారు. మెహర్‌ రమేష్‌తో భోళాశంకర్ సినిమా చిరంజీవి నెక్ట్ ప్రాజెక్టులో ఒక‌టి. కీర్తి సురేష్ చిరంజీవి(Chiranjeevi) చెల్లిగా, త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!