చిరంజీవి(Chiranjeevi) డైరెక్షన్లో ఇక సినిమాలా!
మోగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మోగా డైరెక్టర్‌గా మారుతున్నారా?. సినిమా దర్శకత్వం తనకు కష్టమేమి కాదని అంటున్నారు చిరంజీవి. అయితే మోగా డైరెక్టర్‌గా ఎప్పుడు మారుతున్నారారోమాత్రం రివీల్ చేశారు.
ఆచార్య సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి(Chiranjeevi)ని దర్శకులు ఇంటర్వ్యూ చేశారు. ఆ ప్రోగ్రామ్‌లో మోగాస్టార్ చిరంజీవి పలు ఆసక్తి కలిగించే విషయాలు చెప్పారు. తనకు డైరెక్షన్ అంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చారు. అంతేకాదు త్వరలో మోగా దర్శకుడిగా మారతానన్నారు.
దర్శకత్వం చేస్తారా అని చిరంజీవిని యంగ్ డైరెక్టర్లు అడిగారు. చిరంజీవి డైరెక్షన్‌పై తన మనసులో మాట చెప్పారు. ఇన్నేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నాని... అన్ని డిపార్టుమెంటుల గురించి అవగాహన ఉందన్నారు. కెమెరా, మ్యూజిక్, ఆర్ట్ వంటి విషయాలపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. తనకు దర్శకత్వం అనేది పెద్ద కష్టంగా అనిపించదని.. ఒకవేళ మంచి కంటెంట్ ఉంటే దర్శకత్వం చాలా ఈజీ అన్నారు. కంటెంట్‌ను చక్కగా వండితే, వడ్డించడం ఎవరైనా చేస్తారని చిరంజీవి అన్నారు.
లెన్సులు మార్చి, ట్రాలీలు వేయడం, డ్రోన్లతో తీయడం వంటివి చేయనని చిరంజీవి చెప్పారు. దర్శకత్వం అంటే కథ, కథనం, కథా గమనం… ఇది ఇంట్రెస్టింగ్ గా చేస్తే సినిమా హిట్టా కాదా అనేది అక్కడే తేలిపోతుంది. అవకాశం వస్తే డైరెక్షన్ చేయాలని ఆశగా ఉంది. కానీ వరుసగా సినిమాలు రావడం వల్ల దర్శకత్వం కుదరడం లేదన్నారు కానీ 70 ఏళ్ళు వచ్చాక డైరెక్టర్ అయి మంచి కంటెంట్‌తో ఇప్పుడున్న దర్శకులకు గట్టి పోటీ ఇస్తానని చిరంజీవి(Chiranjeevi)చెప్పారు.