ఆచార్య (Acharya) : రిలీజ్‌కు ముందే బొమ్మ హిట్టు .. మెగాస్టార్ సిన్మా ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే?

Updated on Apr 26, 2022 04:49 PM IST
Acharya Movie Poster
Acharya Movie Poster

ఆచార్య (Acharya).. విడుదలకు ముందే ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మెగాస్టార్ అభిమానులలో ఓ పండగ వాతావరణాన్ని సృష్టించింది. కొరటాల శివ దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ చిత్రంలో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన మరో అదనపు ఆకర్షణ. ఏప్రిల్ 29న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి, ప్రమోషన్లు కూడా భారీగానే జరుగుతున్నాయి.

అలాగే ఇటీవలే విడుదలైన సినిమా ట్రైలర్ కూడా మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ప్రాంతాల వారీ ఈ సినిమా వ్యాపారాన్ని గమనిస్తే, చాలామందికి ఆశ్చర్యమే కలుగుతుంది. 

నైజాం : రూ. 42 కోట్లు
సీడెడ్ : రూ. 20 కోట్లు
ఉత్త‌రాంధ్ర : రూ. 13 కోట్లు
తూర్పు : రూ. 9 కోట్లు
పశ్చిమం : రూ. 7.5 కోట్లు
గుంటూరు : రూ. 9 కోట్లు
కృష్ణా : రూ. 8 కోట్లు
నెల్లూరు : రూ. 4.5 కోట్లు

ఆంధ్రప్రదేశ్ +తెలంగాణ : 113 కోట్లు
ఓవ‌ర్సీస్ మార్కెట్ : 12 కోట్లు
క‌ర్ణాట‌క+రెస్ట్ ఆఫ్ ఇండియా : 12 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా జరిగిన బిజినెస్ (మొత్తం) : 137 కోట్లు

 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!