చిరంజీవి (Chiranjeevi) 153 వ సినిమా రిలీజ్ వాళ్ల‌కు ఇబ్బందేన‌ట‌.

Updated on May 11, 2022 09:49 AM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాల విష‌యంలో త‌గ్గేదేలేదంటున్నారు. యంగ్ హీరోల‌తో పోటీగా చిరంజీవి సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 12న గాడ్‌ఫాద‌ర్‌ను థియేటర్లలోకి పంపాల‌ని చూస్తున్నార‌ట‌. 

చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ రిలీజ్ ఆగ‌స్టు 12 అని టాక్. అధికారికంగా ఇంకా ప్ర‌క‌ట‌న రాలేదు. కానీ ఆచార్య సినిమాతో నిరాశ ప‌డిన చిరు (Chiranjeevi) అభిమానుల్లో హుషారు నింపేందుకు గాడ్‌ఫాద‌ర్ త్వ‌ర‌గా రిలీజ్ చేయాని ప్లాన్ చేస్తున్నారు. 

మోహ‌న రాజ డైరెక్ష‌న్‌లో చిరంజీవి 153 వ సినిమా గాడ్ ఫాద‌ర్ తెర‌కెక్కుతుంది. మోహన్ లాల్ హీరోగా చేసిన మలయాళ లూసిఫ‌ర్ సినిమాను గాడ్ ఫాద‌ర్‌గా రీమేక్ చేస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమాలో పూరి జ‌గ‌న్నాథ్ గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్ర‌త్యేక పాత్ర‌లో యాక్ట్ చేస్తున్నారు. నయనతార, సత్యదేవ్‌లు గాడ్ ఫాద‌ర్‌లో న‌టిస్తున్నారు. 

గాడ్ ఫాద‌ర్ సినిమా కంటెంట్ పరంగా ఆగస్టు 12న రిలీజ్ చేస్తార‌ట‌. ఆగ‌స్టు 15 రోజున గాడ్ ఫాద‌ర్ థియేట‌ర్ల‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆగ‌స్టు సెకెండ్ వీక్‌లో స‌మంత‌, అఖిల్, నితిన్  సినిమాలు కూడా విడుద‌ల కానున్నాయి. చిరంజీవి సినిమాతో చిన్న సినిమాల‌కు స్కోప్ లేకుండా పోతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆగ‌స్టు సెకెండ్ వీక్ రిలీజ్ అయితే.. యంగ్ హీరోల సినిమాల‌కు చిక్కులు త‌ప్ప‌వ‌ని సీనీ క్రిటిక్స్ అంటున్నారు. గాడ్ ఫాద‌ర్ సినిమా అఫీషియ‌ల్ అనౌన్స్ ఎప్పుడెప్పుడా అని చిరు  (Chiranjeevi) ఫ్యాన్స్ తో పాటు యంగ్ హీరోలు ఎదురు చూస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!