చిరంజీవి (Chiranjeevi) ఇక వరుస సినిమాలతో స్పీడ్ పెంచనున్నారా?

Updated on Apr 26, 2022 11:07 AM IST
ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి (Chiranjeevi), రాంచరణ్
ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి (Chiranjeevi), రాంచరణ్

వరుసగా సినిమాలు ప్రకటిస్తూ వాటి షూటింగ్‌లను స్టార్ట్ చేస్తూ ఫ్యాన్స్​కు జోష్‌ ఇస్తున్నాడు చిరంజీవి (Chiranjeevi). మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఇక, గాడ్‌ఫాదర్, భోళాశంకర్‌‌ సినిమాలు చేయబోతున్నట్టు ప్రకటించాడు మెగాస్టార్. తాజాగా యువ దర్శకుడు వెంకీ కుడుములతో సినిమాకు ఓకే చెప్పినట్టు వెల్లడించి ఫ్యాన్స్​కు సర్‌‌ప్రైజ్ ఇచ్చాడు. సినిమాలు ప్రకటించడమే కాదు వాటిని సెట్స్​పైకి తీసుకెళ్లి షూటింగ్‌ పూర్తి చేసే దిశగా కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు చిరంజీవి.

ఆచార్య విడుదల కాకముందే మోహన్‌రాజ్‌ దర్శకత్వంలో గాడ్‌ఫాదర్‌‌ సినిమా షూటింగ్‌ను పట్టాలెక్కించిన మెగాస్టార్.. మెహెర్ రమేశ్‌ డైరెక్షన్‌ చేయబోతున్న సినిమా భోళా శంకర్‌‌ను కూడా సెట్స్​పైకి తీసుకెళ్లాడు. ఆచార్య సినిమా ప్రమోషన్స్​లో భాగంగా మీడియాతో మాట్లాడిన చిరు.. ఇంకా చాలా సినిమాలు లైన్‌లో ఉన్నాయని చెప్పాడు. ప్రస్తుతం నటిస్తున్నవి, షూటింగ్‌ జరుగుతున్నవి కాకుండా చాలా ప్రాజెక్టులు ఓకే చేసినట్టు చెప్పి షాకిచ్చాడు. రానున్న రోజుల్లో మరో సినిమాను ప్రకటిస్తానని స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు.

చిరంజీవి (Chiranjeevi), రాం​ చరణ్​ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.  ఇటీవలే విడుదలైన ట్రైలర్​ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. యాక్షన్​ ఎంటర్​టైనర్​గా రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్​ 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. ప్రమోషన్లు కూడా ప్రారంభించి ఈరోజే ప్రీ రిలీజ్​ ఈవెంట్​ కూడా నిర్వహిస్తోంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్‌‌ బోర్డు.​​

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!