ఆచార్య (Acharya) సినిమాకు ప్రిన్స్ మహేష్‌బాబు (Mahesh Babu) వాయిస్‌ ఓవర్

Updated on Apr 21, 2022 07:21 PM IST
ఓ మీటింగ్‌లో మహేష్ బాబు (Mahesh Babu) & చిరంజీవి (Chiranjeevi)
ఓ మీటింగ్‌లో మహేష్ బాబు (Mahesh Babu) & చిరంజీవి (Chiranjeevi)

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్‌‌స్టార్‌‌ రాంచరణ్‌ (Ramcharan) కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆ చిత్ర యూనిట్‌ నుంచి వచ్చిన సమాచారం.. ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచింది. ముందు నుంచే భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఏప్రిల్‌ 29న బాక్సాఫీస్‌ను ఢీకొట్టబోతోంది.

ప్రస్తుతం ఈ సినిమాపై మరో అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆచార్య సినిమాలో చిరంజీవి, రాంచరణ్‌ ఇంట్రడక్షన్ సీన్లకు సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే దీని గురించి ఆచార్య టీమ్‌ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కొరటాల దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, అలాగే రామ్‌చరణ్ సరసనపూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!