చిరంజీవి సినిమా నిర్మాత‌గా.. రాడాన్ సంస్థ అధినేత రాధిక శ‌ర‌త్‌కుమార్ (Radikaa Sarathkumar)

Updated on May 01, 2022 11:18 PM IST
చిరంజీవితో రాధికా శరత్ కుమార్
చిరంజీవితో రాధికా శరత్ కుమార్

రాధిక శరత్ కుమార్.. ఈ పేరు చాలామందికి సుపరిచితమే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా సూపర్ హిట్లే. అభిలాష, న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, పట్నం వచ్చిన పతివ్రతలు, యమకింకరుడు, బిల్లా రంగా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. తమిళంలో కూడా రాధిక అగ్ర కథానాయికగా వెలుగొందారు. నటుడు శరత్ కుమార్‌ని వివాహమాడాక, రాడాన్ సంస్థకు అధినేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 

ఇటీవలి కాలంలో రాధిక శ‌ర‌త్‌కుమార్ (Radikaa Sarathkumar) పై పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇవే వార్త‌ల‌పై ఆమె ట్వీట్ చేసి స‌మాధానం ఇచ్చారు.  అలాగే ఆమె ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసిన ఓ విషయం కూడా పలువురికి ఆశ్చ‌ర్యం క‌లిగించింది. యాక్ట‌ర్‌గా ఉన్న రాధిక కొత్త‌గా ఓ సినిమాను నిర్మించ‌నున్నార‌ట‌. ఆ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారానే తెలిపారు. ఇక ఆ సినిమా హీరో ఎవరో తెలిస్తే షాక్ అవాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాధిక భ‌ర్త శ‌ర‌త్‌కుమార్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నార‌ట‌. అంటే రాడ‌న్ బ్యాన‌ర్‌లో చిరు హీరోగా ఒక సినిమాని రాధిక ప్రొడ్యూస్ చేస్తున్నారన్నదే టాక్. 

రాడాన్ బ్యాన‌ర్‌లో శ‌ర‌త్ కుమార్ నిర్మాత‌గా చేస్తున్న సినిమాను చిరంజీవి అంగీక‌రించినందుకు "థాంక్యూ" అంటూ రాధిక ట్వీట్ చేశారు. కింగ్ ఆఫ్ మాస్‌తో బ్లాక్ బాస్ట‌ర్ మూవీ తీస్తున్నందుకు ఎదురు చూస్తున్నామంటూ ఓ పోస్ట్ సైతం చేశారు. ఆచార్య మూవీతో డీలా ప‌డిన చిరంజీవి అభిమానుల‌కు రాధిక శ‌ర‌త్‌కుమార్ పోస్ట్ ఆనందాన్ని క‌లిగించిందనడంలో అతిశయోక్తి లేదు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!