Babli Bouncer: తెలుగు జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి; ఇద్దరికి గాయాలు..మీడియా సమావేశంలో ఘటన

Updated on Sep 17, 2022 05:44 PM IST
మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) కీలకపాత్రలో నటించిన సినిమా బబ్లీ బౌన్సర్‌‌. ఈ సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది
మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) కీలకపాత్రలో నటించిన సినిమా బబ్లీ బౌన్సర్‌‌. ఈ సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది

తెలుగు మీడియాకు చెందిన కొందరు జర్నలిస్టులపై బౌన్సర్లు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధుర్‌‌ భండార్కర్ దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) కీలకపాత్రలో నటించిన సినిమా బబ్లీ బౌన్సర్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది బబ్లీ బౌన్సర్‌‌ సినిమా.

ప్రముఖ ఓటీటీ డిస్నీ + హాట్‌స్టార్‌‌లో సెప్టెంబర్‌‌ 23వ తేదీ నుంచి బబ్లీ బౌన్సర్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మీడియా సమావేశానికి హీరోయిన్‌ తమన్నా, దర్శకుడు మధుర్‌‌ భండార్కర్‌‌ హాజరయ్యారు.

మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) కీలకపాత్రలో నటించిన సినిమా బబ్లీ బౌన్సర్‌‌. ఈ సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది

ఇద్దరికి గాయాలు..

తమన్నా ఫోటోలు తీసుకుని సమావేశం నుంచి బయటకు వస్తున్న మీడియా కెమెరామెన్లను అక్కడే ఉన్న బౌన్సర్లు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మీడియాకు చెందిన కెమెరామెన్లపై బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు కెమెరామెన్లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బబ్లీ బౌన్సర్ చిత్ర యూనిట్‌ మీడియాతో చర్చలు జరిపారు.

లేడీ ఓరియెంటెడ్‌ సినిమాగా తెరకెక్కింది ‘బబ్లీ బౌన్సర్‌‌’ సినిమా. ఈ సినిమాలో తమన్నా (Tamannaah) బౌన్సర్‌‌గా నటించారు. బబ్లీ బౌన్సర్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. బౌన్సర్లకు కేరాఫ్ అడ్రస్ ఫతేపూర్ బేరీ గ్రామం అనే వాయిస్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈసారి పహిల్వాన్ అబ్బాయి కాదు అమ్మాయి అంటూ సాగే ట్రైలర్‌‌ ఆకట్టుకునేలా ఉంది.

Read More : నా గురించి ఎవరూ అలా అనుకోకూడదంటున్న తమన్నా (Tamannaah Bhatia)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!