Commitment Trailer: తేజస్వి, అన్వేషి జైన్ ప్రధాన పాత్రల్లో 'కమిట్‌మెంట్‌'.. బోల్డ్ సీన్స్‌తో ట్రైలర్ రిలీజ్!

Updated on Aug 06, 2022 02:20 PM IST
సినీ ఇండస్ట్రీలో నటీమణులతో పాటు, పలు రంగాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులే కథాంశంగా 'కమిట్‌మెంట్‌' (Commitment) చిత్రాన్ని తెరకెక్కించారు.
సినీ ఇండస్ట్రీలో నటీమణులతో పాటు, పలు రంగాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులే కథాంశంగా 'కమిట్‌మెంట్‌' (Commitment) చిత్రాన్ని తెరకెక్కించారు.

బిగ్ బాస్ బ్యూటీ తెలుగమ్మాయి తేజస్వి మదివాడ (Tejaswi Madivada), అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కమిట్‌మెంట్‌' (Commitment). లవ్, డ్రీమ్, హోప్, ఫైట్ అనేది ట్యాగ్ లైన్. నాలుగు ఇంట్రెస్టింగ్‌ కథలతో తెరకెక్కిన ఈ మూవీని రచనా మీడియా వర్క్స్‌ సమర్పణలో, ఎఫ్‌3 ప్రొడక్షన్స్‌, ఫుట్‌ లూస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తుండగా.. లక్ష్మీ కాంత్‌ దర్శకత్వం వహించారు.

తాజాగా 'కమిట్‌మెంట్‌' (Commitment Trailer) సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రారంభంలో భగవద్గీత ప్రవచనాన్ని వినిపించారు. ఒక వైపు డార్క్ సన్నివేశాలు చూపిస్తుండగా.. వెనుక నుండి ప్రవచనాన్ని ప్లే చేశారు. ‘మురికి చేత అద్దము, మావి చేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి యున్నది’ అంటూ భగవద్గీత ప్రవచనంతో ఈ ట్రైలర్ సాగుతుంది .

ఈ నేపథ్యంలో నెటిజన్లు.. 'బూతు సన్నివేశాలకు భగవద్గీత ప్రవచనాలు' యాడ్ చేశారు అంటూ మండిపడుతున్నారు. ఈ సినిమాలో నటించిన నటీనటులను ఉద్దేశించి ట్రోల్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు. 

నిజానికి రెండేళ్ల క్రితమే పూర్తయిన 'కమిట్‌మెంట్‌' (Commitment Movie) సినిమా, కరోనా పాండమిక్ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో, ఎట్టకేలకు ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువస్తున్నారు నిర్మాతలు.

ఆగస్ట్ 19న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. 'కమిట్‌మెంట్‌' సినిమా పోస్టర్లతో పాటు, టీజర్ అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇక, ఈ సినిమాలో అమిత్ తివారి, రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటించారు. సినీ ఇండస్ట్రీలో నటీమణులపై లైంగిక వేధింపులతో పాటు.. పలు రంగాల్లో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలే కథాంశంగా 'కమిట్‌మెంట్‌' (Commitment Movie) చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

'వాడి పక్కన పడుకోడానికి మనం రోడ్డు మీద కనిపించే కుక్కలం కాదు.. మొగాడు ఎట్లైనా బ్రతుకుతాడు.. కానీ ఆడది యుద్ధం చేస్తేనే బ్రతుకుతుంది' అనే డైలాగ్ ఈ సినిమా మెయిన్ ప్లాట్‌ను తెలియజేస్తోంది.

Read More: కోరమీసం, గడ్డంతో సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్ వైరల్.. త్రివిక్రమ్(Trivikram) సినిమా కోసమేనా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!