రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న అల్లు శిరీష్ (Allu Sirish) ‘ఊర్వశివో రాక్షసివో’! నిజమేనా?
‘గౌరవం’ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టారు అల్లు శిరీష్ (Allu Sirish). విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ తన ఇమేజ్‌ను మెల్లగా పెంచుకునేలా సినిమాలు చేస్తున్నారాయన. చాలాకాలం గ్యాప్ తీసుకుని ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారాయన. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా లవ్ + రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.
నవంబర్ 4వ తేదీన విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకు అన్ని సెంటర్ల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు, యూత్‌ను కూడా బాగానే ఆకట్టుకుంటోంది ఈ సినిమా. దీంతో శిరీష్‌కు కమర్షియల్ హిట్ దక్కిందని ఇండస్ట్రీ టాక్. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలోని పాటలు, మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఫ్యాన్సీ డీల్ కుదిరిందని టాక్..
కరోనా తర్వాత ఓటీటీల హవా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా గురించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త నెట్‌లో చక్కర్లు కొడుతోంది. రెండు ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.
ముందుగా తెలుగు ఓటీటీ ఆహా వీడియోస్, నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్‌కు ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఏ సినిమా అయినా థియేట్రికల్ రన్ అనంతరం 8 వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ కూడా 2 నెలల తర్వాత ఓటీటీకి రానున్నట్లు టాక్. కాగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై ధీరజ్ మొగిలినేని అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాను నిర్మించారు.
Read More : MOVIE REVIEW : యువతను ఆకట్టుకునే వినూత్న ప్రయత్నం.. అల్లు శిరీష్ (Allu Sirish) ‘ఊర్వశివో రాక్షసివో’ !