సుశాంత్‌ (Sushanth) ‘మా నీళ్ల ట్యాంక్‌’ వెబ్ సిరీస్‌తో పల్లెటూరి అమ్మాయిగా రీఎంట్రీ ఇస్తున్న ప్రియా ఆనంద్

Updated on Jul 10, 2022 07:44 PM IST
ప్రియా ఆనంద్, సుశాంత్ (Sushanth) మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ పోస్టర్
ప్రియా ఆనంద్, సుశాంత్ (Sushanth) మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ పోస్టర్

సుశాంత్‌ (Sushanth).. నాగేశ్వరరావు మనుమడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత మాస్ సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కరెంట్‌సినిమాతో తనలోని నటనను మంచి మార్కులే వేయించుకున్నారు సుశాంత్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

శేఖర్ కమ్ముల- రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందిన లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియా ఆనంద్. ఆ సినిమాలో త‌న అందం, యాక్టింగ్ టాలెంట్ తో అందర్నీ ఆకర్షించింది ప్రియ. ఆ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ స్ధాయిలో సినిమాలు  హిట్‌ కాలేదు.

రామ రామ కృష్ణ కృష్ణ, కో అంటే కోటి, 180 సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికా.. స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌కు చేరుకోలేదు. దీంతో ఆమె తన ఫోకస్‌ మొత్తం తమిళ సినిమాలపై పెట్టారు. ఈ క్రమంలో పలు తమిళ సినిమాలతోపాటు కోలీవుడ్‌లో కూడా సినిమాలలో నటించారు ప్రియా ఆనంద్.

మా నీళ్ల ట్యాంక్ వెబ్‌ సిరీస్ పోస్టర్

వెబ్‌ సిరీస్‌తో ఎంట్రీ..

ఇక చాలా కాలం తర్వాత తెలుగులోకి మరోసారి అడుగుపెట్టారు ప్రియా ఆనంద్. అయితే ఈసారి సినిమాతో పాటు.. ఓ వెబ్ సిరీస్‌తో ఎంట్రీ ఇస్తున్నారు. కొంత గ్యాప్ త‌ర్వాత ఈ భామ చేసిన ఆ వెబ్ సిరీస్ పేరు ‘మా నీళ్ల ట్యాంక్’.

వ‌రుడు కావలెను సినిమాతో మంచి హిట్ సాధించిన లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో `మా నీళ్ల ట్యాంక్` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఒక చిన్న గ్రామంలో పనికిరాని వాటర్ ట్యాంక్‌ చుట్టూ నడిచే కథతో, సరదా సరదా సన్నివేశాలతో ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్కింది. జీ5 సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌గా నటిస్తుండగా, పల్లెటూరు అమ్మాయిగా ప్రియా ఆనంద్ కనిపిస్తోంది.

సుశాంత్‌ (Sushanth) హీరోగా తెరకెక్కిన ఈ వెబ్‌ సీరిస్‌ జూలై 15 నుంచి జీ 5లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. మొత్తం 8 ఎపిసోడ్స్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ టీజ‌ర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రియా ఆనంద్ సొంతంగా డ‌బ్బింగ్ చెప్పారు కూడా.

Read More : సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు : చిరంజీవి (Chiranjeevi) నటించిన టాప్ 10 సినిమాలు.. ఫ్యాన్స్‌కు ప్రత్యేకం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!