పెళ్లి చేసుకున్న హీరోయిన్ పూర్ణ (Poorna).. నెట్‌లో వైరల్ అవుతున్న మ్యారేజ్ ఫొటోలు

Updated on Oct 27, 2022 04:13 PM IST
టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ (Poorna) పెళ్లి చేసుకున్నారు. ఆమె మ్యారేజ్ ఫొటోలు ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నాయి
టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ (Poorna) పెళ్లి చేసుకున్నారు. ఆమె మ్యారేజ్ ఫొటోలు ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నాయి

టాలీవుడ్ నటి పూర్ణ (Poorna) కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీని ఆమె వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి సోమవారం దుబాయ్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షానిద్, పూర్ణ ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా నిర్వహించారు. తన మ్యారేజ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పూర్ణ అభిమానులతో పంచుకున్నారు.  

పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న పూర్ణ.. తన భర్త గురించి గొప్పగా రాసుకొచ్చారు. ‘నేను ప్రపంచంలో అత్యంత అందమైన స్త్రీని కాకపోవచ్చు. మంచి జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలు నాలో లేకపోవచ్చు. కానీ మీరు నన్ను నన్నుగానే ఆరాధించారు. నన్ను మార్చడానికి ఏనాడూ ప్రయత్నించలేదు. నాలోని ప్రతిభను బయటకు తీసుకురావడానికి మీరు ఎంతగానో ప్రోత్సహించారు’ అని భర్త ఆసిఫ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. పెళ్లితో ఓ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించామని.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉంటానని వాగ్ధానం చేస్తున్నానని పూర్ణ రాసుకొచ్చారు.

ఇకపోతే, మలయాళ నటి అయిన పూర్ణ అసలు పేరు షమ్నా ఖాసిమ్‌ (Shamna Kasim). కేరళలోని కన్నూర్ ఆమె సొంతూరు. ఓ రియాలీటీ షోతో పాపులారిటీ సంపాదించి పూర్ణ.. 2004లో ‘మంజుపొలారు పెన్ కుట్టీ’ అనే సినిమాతో మాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగులో శ్రీహరి సరసన చేసిన ‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రంతో పరిచయమయ్యారు. అల్లరి నరేష్‌తో చేసిన ‘సీమటపాకాయ్’తో క్రేజ్ తెచ్చుకున్నారు. 

ప్రముఖ దర్శకుడు, నటుడు రవిబాబు తీసిన ‘అవును’ సినిమాతో పూర్ణకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ‘జయమ్ము నిశ్చయమ్మురా’, ‘రాజుగారి గది’, ‘శ్రీమంతుడు’ ఆమె క్రేజ్‌ను మరింతగా పెంచాయి. కానీ స్టార్ హీరోయిన్ గుర్తింపును మాత్రం తీసుకురాలేదు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న ‘దసరా’లో పూర్ణ యాక్ట్ చేస్తున్నారు. అలాగే తెలుగులో పలు రియాలిటీ షోల్లో ఆమె మెరుస్తున్నారు. కొన్ని షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తున్నారు. 

Read more: "అట్లుంటది మనతోని.. టిల్లు ఈజ్‌ బ్యాక్".. డీజే టిల్లు (DJ Tillu Sequel) సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!