Actress Poorna: దుబాయి వ్యాపారితో పెళ్లి రద్దు వార్తలపై స్పందించిన నటి పూర్ణ.. 'ఎప్పటికీ నా వాడే' అంటూ పోస్ట్
టాలీవుడ్ లో 'శ్రీ మహాలక్ష్మి' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి పూర్ణ (Actress Poorna) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీమ టపాకాయ్ సినిమాతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది పూర్ణ. ఆ తర్వాత అవును, లడ్డు బాబు, నువ్వలా నేనిలా, శ్రీమంతుడు, రాజు గారి గది, జయమ్ము నిశ్చయమ్మురా, అదుగో, సువర్ణ సుందరి, దృశ్యం 2 వంటి ఎన్నో తెలుగు సినిమాలలో నటించిన పూర్ణ ఈ మధ్యనే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ' (Akhanda) సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించారు.
అలాగే పలు టీవీషోలో జడ్జ్ గాను వ్యవహరిస్తోంది పూర్ణ. అయితే, గత కొన్నిరోజులుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఈ అమ్మడు ప్రముఖ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని (Shanid Asif Ali) పెళ్ళాడబోతోంది. గత కొద్దిరోజులుగా వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈమధ్యనే వీరిద్దరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే, ఆ తరువాత పెళ్లిపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు పూర్ణ (Poorna). మరో రెండు, మూడు నెలల్లో వివాహం జరగాల్సి ఉండగా పూర్ణ తన నిర్ణయం మార్చుకున్నారని, షానిద్ ఆసిఫ్‌తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పెళ్లి రద్దయిందంటూ వస్తున్న పుకార్లకు పూర్ణ చెక్ పెట్టింది. తనకు కాబోయే భర్తతో కలిసి దిగి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. 'అతడెప్పటికీ నా వాడే' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పుకారురాయుళ్ల నోటికి తాళం పడినట్లయింది.
ఇదిలా ఉంటే.. ఇటీవలి కాలంలో సినిమా తారల పెళ్లిళ్లు పెటాకులవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా మంది తారలు సైతం తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పేసి గప్ చుప్ గా సినిమాలు చేసుకుంటున్నారు. మరి కొందరైతే ఎంగేజ్ మెంట్ చేసుకున్న తర్వాత పెళ్లి రద్దు చేసుకున్నారు. రష్మిక (Rashmika Mandanna), మెహరీన్ లాంటి వారు కొంతమంది పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ లిస్ట్ లోకి ఓ అమ్మడు వచ్చి చేరిందని వార్తలు వినిపించాయి.
Read More: Actress Poorna: దుబాయి వ్యాపారితో నిశ్చితార్థం అయ్యాక నటి పూర్ణ పెళ్లి రద్దు.. ఈ వార్తల్లో నిజమెంత?