ఎక్స్ ట్రా జబర్దస్త్ (Extra Jadardasth) : క‌మెడియ‌న్, జ‌డ్జిల మ‌ధ్య ప్రేమాయ‌ణం.. చూస్తే న‌వ్వాగ‌దు!

Updated on May 14, 2022 11:41 PM IST
జ‌బ‌ర్ద‌స్త్ న‌రేష్, న‌టి పూర్ణ‌ (Jabardasth Naresh, Actress Purna)
జ‌బ‌ర్ద‌స్త్ న‌రేష్, న‌టి పూర్ణ‌ (Jabardasth Naresh, Actress Purna)

ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే ఎవర్‌గ్రీన్ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ (Jabardasth). ఇదే షో చాలా ఏళ్లుగా విజ‌యవంత‌ంగా ర‌న్ అవుతోంది. ఈ షోకు పోటీగా చాలా షోలు వచ్చాయి. అయినా జబర్దస్త్ వాటినన్నింటినీ త‌ట్టుకొని నిల‌బ‌డింది. కాగా, ఇదే షో ప్ర‌తి గురువారం జ‌బ‌ర్ద‌స్త్ పేరుతో ప్రసారమవుతోంది. అలాగే ప్ర‌తి శుక్ర‌వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ పేరుతో కూడా టెలికాస్ట్ అవుతోంది. 

తాజాగా,  జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో విడుద‌ల‌యింది. ఈ ఎపిసోడ్ వచ్చేవారం ప్రసారమవుతుంది. ఈ ప్రోమోలో జ‌బ‌ర్ద‌స్త్ నరేష్‌, జ‌డ్జి పూర్ణల (Poorna) మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డవడం గమనార్హం. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. జ‌బ‌ర్ద‌స్త్ న‌రేష్ ఇన్నాళ్లూ సింగిల్‌గానే ఉన్నాడని టాక్. కానీ ఉన్నట్టుండి న‌రేష్ పెద్ద షాకే ఇచ్చాడు. తనకు కూడా గర్ల్ ఫ్రెండ్‌ ఉందని ఏకంగా సాక్ష్యాలు చూపించాడు. నరేష్‌.. జబర్దస్త్ సెట్ లోనే ఓ అమ్మాయిని పడేశానని ధైర్యం చెప్పడంతో, అందరూ ఆశ్యర్చపోయారు. 

ఆమె ఎవరో కాదని.. ఆ షోకు కొత్తగా జడ్జ్‌గా వచ్చిన పూర్ణ అని చెప్పడంతో, షోలో కాస్త నవ్వులు విరబూశాయి. టీమ్ లీడ‌ర్ కెవ్వు కార్తీక్‌తో కలిసి చేసిన స్కిట్ లో, నరేష్‌ తనకు కూడా ఓ గర్ల్ ఫ్రెండ్‌ ఉందని చెప్పాడు. అయితే, కార్తీక్‌ నమ్మక‌పోవ‌డంతో... "పూర్ణ (Poorna) ఎవరో తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్" అంటూ స్టేజ్‌పైనే ప్రకటించేశాడు నరేష్.

అప్పుడు కార్తీక్ క‌లుగ‌జేసుకొని "నువ్వు చెబితే ఎవరూ నమ్మరని" అనడంతో రెచ్చిపోయి, అందుకు త‌గ్గ‌ ప్రూఫ్స్ చూపించాడు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన‌ `రాధేశ్యామ్‌`లో ఓ ట్రైన్‌ సీన్ ఉంటుంది. అందులో హీరోయిన్‌ పూజా హెగ్డేని, ప్రభాస్‌ మోసే సన్నివేశానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు నరేష్‌ కూడా, పూర్ణని తాను మోస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ, అదే ఫోటోని మార్ఫింగ్‌ చేయించాడు. దాన్ని పెద్ద పోస్టర్‌లా మార్చి, జబర్దస్త్ స్టేజ్‌పై చూపించాడు. ఇది చూసిన‌ పూర్ణ షాక్ అవగా, యాంకర్‌ రష్మి నోరెళ్ల బెడుతుంది. అనంత‌రం ర‌ష్మి తేరుకొని దీనిపై స్పందిస్తూ, "నరేష్‌.. నువ్వు పూర్ణ బరువు మోస్తావా?" అని ప్రశ్నించగా, "మోసేస్తా" అని తను చెప్తాడు. దీంతో ఈ పంచ్ ఆద్యంతం నవ్వులు పూయించింది. 

నరేష్‌ అంతటితో ఆగకుండా.. "ఇదేం చూశావంటూ" మరో పోస్టర్‌ చూపిస్తాడు. అందులో (Bahubali) `బాహుబలి`లో ప్రభాస్, అనుష్క కలిసి విల్లు ఎక్కుపెట్టి బాణాలు వేస్తున్న ఫోటో మార్ఫింగ్ చేయబడి ఉంటుంది.  అనుష్క ముఖాన్ని పూర్ణతో, ప్రభాస్‌ స్థానంలో తన ఫేస్‌ని జోడించి నరేష్ ఈ పోస్టర్‌‌ను డిజైన్‌ చేయించాడట. దీంతో మరోసారి అంతా ఘోళ్లున నవ్వారు.

ఇదేంటని కార్తీక్‌ ప్రశ్నించగా, `పూర్ణబలి` అంటూ నరేష్‌ షోలో చెప్పడంతో, ఆ ఘటన నవ్వులు విరిసేలా చేసింది. కాగా, ప్రోమోనే ఈ రేంజ్‌లో ఆకట్టుకుంటే, ఇక పూర్తి ఎపిసోడ్‌లో ఇంకెన్ని పంచ్ లు ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు.  అలాగే ఈ పూర్తి ఎపిసోడ్‌లో నరేష్‌ స్కిట్‌ కచ్చితంగా హైలైట్‌గా నిలుస్తుందని చెప్పవ‌చ్చు. కాగా, ఈ షోకు ప్ర‌స్తుతం పూర్ణ, ఇంద్రజ జడ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!