మహేష్‌బాబు(Mahesh Babu) డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్న సుకుమార్, సందీప్ రెడ్డి వంగా? ఎవరికి చాన్స్ ఇస్తాడో..

Updated on Jun 26, 2022 05:07 PM IST
డైరెక్టర్లు సుకుమార్, వంగా సందీప్ రెడ్డి, సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు
డైరెక్టర్లు సుకుమార్, వంగా సందీప్ రెడ్డి, సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు

సూపర్ స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu)తో సినిమా చేయాలని వేచి చూసే దర్శకుల క్యూ పెరిగిపోతోంది. తాజగా మహేష్‌ నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమాను చేయబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. జూలై చివరి వారం నుంచి మహేశ్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుందని సమాచారం. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియన్ సినిమాకు సిద్ధం కావాలని మహేష్‌ ప్లాన్ చేసుకుంటున్నారు.

సినిమా పోస్టర్స్‌

రాజమౌళి సినిమా లేటైతే..

రాజమౌళి సినిమా ప్రారంభం కావడానికి బాగానే సమయం పట్టే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత రాజమౌళి సినిమా స్టార్ట్‌ కావడానికి దొరికే సమయంలో మరో సినిమా చేయాలని మహేష్‌ భావిస్తున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే సుకుమార్, సందీప్ రెడ్డి వంగలతో సినిమాలు చేయాలని చర్చలు జరుపుతున్నారట.

సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు ఇప్పటికే ‘1 నేనొక్కడినే’ సినిమా చేశారు. ఆ సినిమా ఆశించిన స్ధాయిలో విజయం సాధించకపోయినా.. మేకింగ్, మహేష్‌ స్టైల్‌కు మంచి మార్కులే పడ్డాయి. మహేష్‌బాబు గనుక చాన్స్‌ ఇస్తే భారీ హిట్‌ ఇవ్వాలని అనుకుంటున్నాడట సుకుమార్.

యానిమల్ తర్వాత..

ఇక, అర్జున్ రెడ్డి సినిమాతో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్‌‌ సందీప్ రెడ్డి వంగా. సందీప్‌ కూడా మహేశ్ డేట్స్ ఇస్తే సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు సందీప్‌ రెడ్డి.

దీని అర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ప్రభాస్. కాబట్టి ప్రభాస్ డేట్స్ సర్దుబాటయ్యే సమయంలో మహేష్‌బాబు (Mahesh Babu) హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి మహేశ్ సుకుమార్‌‌కి చాన్స్ ఇస్తాడా లేక సందీప్‌ రెడ్డికి కమిట్ అవుతాడో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

Read More: Samantha: హాలీవుడ్‌లోనూ సత్తా చాటడానికి రెడీ అవుతున్న సమంత.. ఫ్యాన్స్‌కు సమాధానం చెప్పడం నా బాధ్యత

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!