5 గంటల్లో .. కోటి వ్యూస్‌ సాధించిన మహేష్‌ బాబు (Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ ట్రైలర్

Updated on May 02, 2022 11:03 PM IST
కోటి  వ్యూస్‌ సాధించిన మహేష్‌ బాబు (Mahesh Babu) సర్కారు వారి పాట ట్రైలర్
కోటి వ్యూస్‌ సాధించిన మహేష్‌ బాబు (Mahesh Babu) సర్కారు వారి పాట ట్రైలర్

మహేష్‌ (MaheshBabu) స్టామినాను సర్కారు వారి పాట ట్రైలర్ మరోసారి నిరూపించింది. తాజాగా రిలీజైన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్‌‌కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు వీక్షించారు. సోమవారం సాయంత్రం సుమారు 4 గంటలకు రిలీజైన ట్రైలర్‌‌కు యూట్యూబ్‌లో ఇప్పటి వరకు దాదాపుగా కోటి వ్యూస్‌ వచ్చాయి. సుమారు 5 గంటల్లో 10 మిలియన్ వ్యూస్‌ సాధించి యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది సర్కారు వారి పాట ట్రైలర్.

U can steal my Love.. నా ప్రేమను దొంగిలించగలవు

U can steal my Friendship.. నా స్నేహాన్నీ దొంగిలించగలవ్‌..

But u cant steal my Money  

అమ్మాయిల్ని, అప్పిచ్చే వాళ్లనీ పాంపర్ చేయాలిరా.. రఫ్‌గా హ్యాండిల్‌ చేయకూడదు

ఇది సర్కారు వారి పాట ట్రైలర్‌‌లో మహేష్‌బాబు చెప్పిన డైలాగ్..

 

సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా ట్రైలర్‌‌ రిలీజైంది. అనుకున్నట్టుగానే మహేష్‌ డైలాగ్స్‌, మేనరిజం ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేలా ఉన్నాయి. డైలాగ్స్, వాటి టైమింగ్‌తోపాటు మహేష్‌ లుక్స్‌ కూడా ఆకట్టుకుంటున్నాయి. విలన్‌గా సముత్రిరఖని పవర్‌‌ఫుల్‌ క్యారెక్టర్‌‌ పోషించినట్టు తెలుస్తోంది. మహేష్‌, వెన్నెల కిషోర్‌‌ మధ్య జరిగే కామెడీ నవ్వులు పూయిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అలరిస్తోంది. మొత్తానికి మహేష్‌ సినిమా ట్రైలర్‌‌ అందరికీ నచ్చేలా.. సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉందని చెప్పచ్చు.

తాజాగా రిలీజైన ట్రైలర్‌‌లో మహేష్‌ డైలాగ్స్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్‌‌ స్టార్టింగ్‌లో మహేష్‌ చెప్పిన ‘ నా ప్రేమను దొంగిలించగలరు.. నా స్నేహాన్ని దొంగిలించగలరు.. కానీ నా డబ్బును ఎవ్వరూ దొంగిలించలేరు’ డైలాగ్స్‌ సినిమాలో తన క్యారెక్టర్‌‌ను తెలియజేస్తున్నాయి.

ఇక, వెన్నెల కిషోర్, మహేష్‌బాబు మధ్య జరిగే సంభాషణల్లో.. ‘పెళ్లికి అప్పుడే ఏం తొందర ఇంకా చిన్న పిల్లాడైతేను’ అని కిషోర్‌‌ అనడంతోటే.. ‘అందరూ అలాగే అనుకుంటున్నారయ్యా.. మెయింటెయిన్‌ చేయలేక దూల తీరిపోతోంది’ అని మహేష్‌ చెప్పే ఆన్సర్‌‌ ఆకట్టుకుంటోంది.

వరుస హిట్లతో జోరు మీదున్న మహేష్‌.. తన విజయయాత్రను కొనసాగించాలనే సంకల్పంతో ఉన్నాడు. అదే ఊపుతో సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేశాడు. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు ఇప్పటికే సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇటీవల రిలీజైన టైటిల్‌ సాంగ్‌ కూడా మాస్‌ ప్రేక్షకులతోపాటు క్లాస్ ప్రేక్షకులను కూడా అలరిస్తోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!