రికార్డులు కొల్ల‌గొడుతున్న‌ బాలయ్య (Unstippable with NBK) 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె' టాక్ షో!

Updated on May 11, 2022 11:01 PM IST
(Unstippable with NBK) 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె' టాక్ షో!
(Unstippable with NBK) 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె' టాక్ షో!

తెలుగు బుల్లితెరపై ప్ర‌స్తుతం టాక్ షోల ట్రెండ్ నడుస్తోంది. సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) నుంచి యంగ్ హీరోలు ద‌గ్గుబాటి రానా, నాని వరకు టాక్ షోలు, రియాలిటీ షోలతో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున అప్ప‌ట్లో బిగ్ బాస్ రియాలిటీ షో,  మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షోలతో తనదైన మార్కుని సెట్ చేశారు. ఇక ప్ర‌స్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ రియాలిటీ షోకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. మ‌రోవైపు ద‌గ్గుబాటి రానా నెం.1 యారీతో హోస్ట్ గా మారి ఆకట్టుకున్నాడు. నాచురల్ స్టార్ నాని కూడా బిగ్ బాస్  షో సీజ‌న్ 2 కు హోస్ట్ గా వ్యవహరించి తనదైన మార్కు ఎంటర్ టైన్ మెంట్ ని అందించాడు. 

ఇదిలా ఉంటే వీరందరికి భిన్నంగా సీనియ‌ర్ హీరో బాలయ్య 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె' (Unstippable with NBK) తో తొలిసారి హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. 'ఆహా' తెలుగు ఓటీటీ కోసం ప్రత్యేకంగా హోస్ట్ అవతారం ఎత్తిన బాలయ్య ఈ షోతో రియాలిటీ షోల్లో రికార్డుల మోత మోగించేశారు. మోస్ట్ వ్యూస్ పొందిన‌ రియాలిటీ షోగా `అన్ స్టాపబుల్` ఐఎండీబీలో సరికొత్త రికార్డుని సొంతం చేసుకుని పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. బాలయ్య తొలిసారి హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో అత్యధికంగా స్ట్రీమింగ్ అయిన షోగా కూడా రికార్డుని సొంతం చేసుకుంది.ఈ టాక్ షో సెలబ్రిటీ టాక్ షోల్లో బెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ టాక్ షోలో ప్రముఖులతో బాలయ్య తనదైన స్టైల్లో జరిపిన సంభాషణలు ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకున్నాయి. ఇందువ‌ల్లే సూపర్ హిట్ షోగా నిలబడ‌గ‌లిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా బాలయ్య ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. 

సెలబ్రిటీ టాక్ షోల్లో నెంబర్ వన్ షోగా రికార్డులు సొంతం చేసుకున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె' (Unstippable with NBK) ఖాతాలో తాజాగా రెండు సిల్వర్ ట్రోఫీలు వచ్చి చేరాయి. బెస్ట్ రీజినల్ టీవీ ప్రోగ్రామ్, బెస్ట్ రీజినల్ టీవీ రియాలిటీ షో విభాగాల్లో ఈ షోకు రెండు సిల్వర్ ట్రోఫీలు తాజాగా దగ్గడం విశేషం. త్వరలోనే ఈ షో సీజన్ 2 ప్రారంభిం కానున్న నేపథ్యంలో రెండు సిల్వర్ ట్రోఫీలు ఈ షోకు దక్కడం విశేషం. కాగా, బాలకృష్ణ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!