Unstoppable ( అన్‌స్టాపబుల్) : బాల‌కృష్ణ షో టైటిల్‌తో వినోదాన్ని పంచే.. వీజే స‌న్నీ సినిమా !

Updated on Jun 01, 2022 03:19 PM IST
బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్‌ వీత్‌ ఎన్బీకే  షో చాలా పాపుల‌ర్ అయింది. ఆ షో టైటిల్‌తో  వీజే స‌న్నీ (VJ Sunny)  వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు.
బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్‌ వీత్‌ ఎన్బీకే  షో చాలా పాపుల‌ర్ అయింది. ఆ షో టైటిల్‌తో  వీజే స‌న్నీ (VJ Sunny) వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 5 విన్నర్ వీజే సన్నీ (VJ Sunny) హీరోగా వెండితెర‌పై మెప్పించ‌నున్నాడు. బాల‌కృష్ణ షో అన్‌స్టాపబుల్ టైటిల్‌ను వీజే స‌న్నీ సినిమాకు ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన పూజా క్యార్య‌క్ర‌మాలు మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. ఈ కార్యక్రమంలో  రచయిత విజయేంద్రప్రసాద్, దర్శకుడు బి.గోపాల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. రైట‌ర్ విజయేంద్ర ప్రసాద్ వీజే స‌న్నీ సినిమాకు క్లాప్ కొట్టారు. దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.  

బాల‌కృష్ణలా న‌టించి ఫ‌న్ అందించిన వీజే స‌న్నీ
వీజే స‌న్నీ (VJ Sunny) బిగ్ బాస్‌లో మ‌చ్చా అంటూ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. బిగ్ బాస్‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు నాన్ స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించాడు. బిగ్ బాస్ విన్న‌ర్ అయిన స‌న్నీ.. వ‌రుస సినిమా ఆఫ‌ర్ల‌తో బిజీగా మారారు. సన్నాఫ్‌ ఇండియా ఫేమ్‌ డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో వీజే స‌న్నీ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాకు అన్‌స్టాపబుల్  (Unstoppable) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్‌ వీత్‌ ఎన్బీకే  షో చాలా పాపుల‌ర్ అయింది. ఆ షో టైటిల్‌తో  వీజే స‌న్నీ వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు. బిగ్ బాస్‌లో ఓ టాస్క్‌లో వీజీ స‌న్నీ బాల‌కృష్ణ‌గా యాక్ట్ చేసి న‌వ్వులు పూయించాడు. బాల‌కృష్ణ‌లాగా న‌టించిన స‌న్నీకి మంచి పేరు కూడా వ‌చ్చింది. ఇప్పుడు బాల‌కృష్ణ షో టైటిల్‌తో అద‌ర‌గొట్టేందుకు రెడీ అవుతున్నాడు. 

 సన్నాఫ్‌ ఇండియా ఫేమ్‌ డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో వీజే స‌న్న(VJ Sunny) సినిమా చేస్తున్నారు.

గ‌బ్బ‌ర్ సింగ్ కామెడీ టీమ్‌తో కామెడీ వేరే లెవ‌ల్

వీజే స‌న్నీ(VJ Sunny)  హీరోగా ద‌ర్శ‌కుడు ర‌త్న‌బాబు అన్‌స్టాపబుల్ -  నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వీజే స‌న్నీతో పాటు క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, పృధ్వి, మణిచందన, షకలక శంకర్, విరాన్ ముత్తమ్ శెట్టి, చమ్మక్ చంద్ర, బిత్తిరి సత్తిలు ఈ సినిమాలో సంద‌డి చేయ‌నున్నారు. గబ్బర్ సింగ్ బ్యాచ్ కూడా ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు.  A2B ఇండియా ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రంజిత్ రావ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షేక్ రఫీ, బిట్టు న్యావనంది సహా నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

వీజే స‌న్నీ(VJ Sunny)  హీరోగా ద‌ర్శ‌కుడు ర‌త్న‌బాబు అన్‌స్టాపబుల్ -  నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఎంతైనా క‌ష్ట‌ప‌డ‌తాను - వీజే స‌న్నీ
ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి తాను ఏదైనా చేస్తాన‌ని వీజే స‌న్నీ (VJ Sunny)  అన్నారు. న‌టుడుగా తాను 100 శాతం క‌ష్ట‌ప‌డి ఆడియ‌న్స్‌కు వినోదం అందిస్తాన‌న్నారు. బిగ్ బాస్ త‌ర్వాత వ‌చ్చిన సినిమా అవ‌కాశాల‌తో  న‌టుడుగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంటాన‌ని వీజే స‌న్నీ తెలిపారు. ద‌ర్శ‌కుడు ర‌త్న‌బాబుకు సినిమా తీయాలని ఎంతో పట్టుదలతో ఉన్నారని.. అందుకే అత‌ను చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఓకే చేశాన‌న్నారు. ఈ సినిమాకు త్రిమూర్తులు లాంటి నిర్మాతలతో పాటు మంచి టీం దొరికారన్నారు. దిల్ రాజు, హరీష్ శంకర్‌ల ఆశీర్వాదంతో మ‌రో సినిమా చేస్తున్నాన‌ని వీజే స‌న్నీ చెప్పుకొచ్చారు. 

ద‌స‌రాకు వీజే స‌న్నీ (VJ Sunny) అన్‌స్టాప‌బుల్  (Unstoppable) సినిమా రిలీజ్ చేస్తామ‌న్నారు

200 మంది ఆర్టిస్టుల‌తో సినిమా చేస్తున్నా : డైమండ్ ర‌త్న‌బాబు

బాల‌కృష్ణ షో టైటిల్‌ అన్‌స్టాప‌బుల్ సినిమా తీస్తున్న‌మ‌ని ద‌ర్శ‌కుడు డైమండ్ ర‌త్న‌బాబు అన్నారు. నిర్మాత‌లు బాగుండాల‌ని కోరుకునే సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా.. వీజే స‌న్నీతో చేసే సినిమా టైటిల్ రిలీజ్ చేశామ‌న్నారు. త‌న సినిమా కోసం 200 మంది ఆర్టిస్టులను సెలెక్ట్ చేశామ‌న్నారు. జూన్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్  జ‌రుగుతుంద‌న్నారు. ద‌స‌రాకు వీజే స‌న్నీ అన్‌స్టాప‌బుల్  (Unstoppable) సినిమా రిలీజ్ చేస్తామ‌న్నారు. 

ప్రేక్ష‌కుల‌కు వీజే స‌న్నీ సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని సహా నిర్మాత రఫీ అన్నారు. హీరో కోసం వెతుకుతున్న స‌మ‌యంలో.. వీజే స‌న్నీ పేరు అనుకోగానే, అప్ప‌టిక‌ప్పుడు హీరోగా సెలెక్ట్ చేశామ‌న్నారు. ఇది ఫుల్ కామెడీ సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌న్నారు. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!