'భీమ్ రావ్ దొర' పాత్రలో భీకరంగా జగపతి బాబు (Jagapathi Babu).. 'రుద్రంగి' (Rudrangi) మోషన్ పోస్టర్ రిలీజ్!

Updated on Oct 06, 2022 03:34 PM IST
మీ భీమ్ రావ్ దొర (Bheem Rao Dhora) ఫ్రమ్ రుద్రంగి మూవీ’ అంటూ జగపతి బాబు (Jagapati babu) ఓ పిక్‌ని పోస్ట్ చేశారు.
మీ భీమ్ రావ్ దొర (Bheem Rao Dhora) ఫ్రమ్ రుద్రంగి మూవీ’ అంటూ జగపతి బాబు (Jagapati babu) ఓ పిక్‌ని పోస్ట్ చేశారు.

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు (Jagapathi Babu) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌ం లేదు. తెలుగు ఇండస్ట్రీలో హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు ఈ నటుడు. ఆ త‌రువాత కొన్ని సినిమాల్లో విల‌న్‌గా న‌టించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు. అప్పట్లో ఫ్యామిలీ హీరోగా వైవిద్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌ను ఎంచుకొని విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. 

ఇదిలా ఉంటే.. జగపతి బాబు (Jagapathi Babu) తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. జగపతి బాబు తాజాగా మరో ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ప్రస్తుతం ఆయన 'రుద్రంగి' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ‘బాహుబలి (Bahubali), ఆర్ఆర్ఆర్ (RRR)’ చిత్రాలకు రైటర్‌గా పని చేసిన అజయ్ సామ్రాట్ (Ajay Samrat) ఈ చిత్రానికి దర్శకుడు. 

అయితే, ఆయన ట్విటర్ లో పోస్ట్ చేస్తూ.. ‘ఫస్ట్ ఇన్నింగ్స్ చూశారు.. సెకండ్ ఇన్నింగ్స్ చూశారు.. థర్డ్ ఇన్నింగ్స్ చూడబోతున్నారు. మీ భీమ్ రావ్ దొర (Bheem Rao Dhora) ఫ్రమ్ రుద్రంగి మూవీ’ అంటూ ఓ పిక్‌ని పోస్ట్ చేశారు. ఈ పిక్‌లో ఆయన భీకరంగా, జాలి-దయ లేని కర్కోటకుడిగా కనిపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది. 

'రుద్రంగి' (Rudrangi) సినిమా ద్వారా తెలంగాణ ఉద్యమకారుడు, కవి, గాయకుడు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ తో చిత్రసీమ లోకి అడుగుపెడుతున్నారు. ఇక, ఈ సినిమా మోషన్ పోస్టర్ (Rudrangi Motion Poster) విషయానికి వస్తే.. “రుద్రంగి నాది, రుద్రంగి బిలాంగ్స్ టూ మీ” అని జగపతి బాబు చెప్పే డైలాగ్‌తో దీన్ని రూపొందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్.. అన్నీ టాప్ క్లాస్‌లో ఉన్నాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!