ఒకే వేదిక‌పై డ్యాన్స్ (Dhee Dance Show) చేసిన‌ మెగా స్టార్, ప‌వ‌ర్ స్టార్.. ప్రోమో వైర‌ల్!

Updated on May 07, 2022 09:39 PM IST
ఢీ డ్యాన్సింగ్ ఐకాన్ (Dhee 14 Dancing Icon)
ఢీ డ్యాన్సింగ్ ఐకాన్ (Dhee 14 Dancing Icon)

టాలీవుడ్ టాప్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పనిలేదు. వీరిద్ద‌రూ క‌లిసి డ్యాన్స్ చేస్తే చూడాల‌నుకుంటున్నారా.. రియ‌ల్ గా కాదు కానీ ఈ ఇద్ద‌రినీ పోలిన మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి ఆ సంద‌డిని తీసుకొచ్చారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన‌ స‌ర్కారు వారి పాట సినిమాలోని క‌ళావ‌తి పాట‌కు క్యాచీ స్టెప్పులేసి ఆ ఇద్ద‌రు డ్యాన్స‌ర్లు వావ్ అనిపించారు. ఈ హంగామా అంతా జ‌రిగింది ఎక్క‌డో కాదు రియాలిటీ డ్యాన్స్ షో ఢీ 14 వేదిక‌పై (Dhee Dance Show).

చిరంజీవి డూప్ ఠాగూర్ లోని చిన్న‌గ చిన్న‌గ పాట‌కు డ్యాన్స్ చేసిన అనంత‌రం ప‌వ‌ర్ క‌ళ్యాణ్ డూప్ ఎంట్రీ ఇవ్వ‌డం, నీతో క‌లిసి డ్యాన్స్ చేయాల‌న్న‌ది ఈమె కోరిక అంటూ చిరు డూప్ ప‌వ‌న్ కు చెప్ప‌డం.. ఇలా ప్ర‌తిదీ అంద‌రినీ ఆక‌ట్టుకునేలా ఉంది. షో లో ఈ పాట‌కు పర్ఫామ్ చేసిన డూప్ ల‌తో టీమ్ లీడ‌ర్లు ర‌విక‌ష్ణ‌, న‌వ్య‌స్వామి క‌లిసి డ్యాన్స్ చేసి పాట‌కు మ‌రింత అందాన్ని తీసుకొచ్చారు. వీరి ప్ర‌తిభ‌కు విజిల్ వేయ‌డం న్యాయ నిర్ణేత‌ల్లో ఒక‌రైన గ‌ణేశ్ మాస్ట‌ర్ వంతైంది. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన జడ్జ్ గణేష్ మాస్టర్ వీరిద్దరు డాన్స్ చేస్తూ ఉంటే ఫిదా అయిపోయారు. 

అయితే.. చిరు, పవన్​ కలిసి డ్యాన్స్​ చేసి చాలా కాలమైంది. అప్ప‌ట్లో వజ్రోత్సవంలో ఒకసారి.. తర్వాత శంకర్​దాదా సినిమాలో కలిసి స్టెప్పులేశారు ఈ మెగాబ్రదర్స్​. అయితే ఇప్పుడు 'ఢీ' (Dhee Dance Show) షోలో అలాంటి ఫీలింగ్​ను కల్పించబోతున్నారు ఈ జూనియర్లు ఇద్దరు. వ‌చ్చే బుధ‌వారం రాత్రి 9.30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుద‌లై సంద‌డి చేస్తోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!