బిగ్ బాస్ సీజన్ 6 లో మిల్కీబ్యూటీ తమన్నా (Tamannaah).. అర్జున్ కల్యాణ్ బౌన్సర్ గా శ్రీ సత్య.. ప్రోమో వైరల్!

Updated on Sep 18, 2022 03:05 PM IST
బిగ్ బాస్ (Telugu Biggboss) వేదికపై పింక్ సూట్ లో మెరిసిన తమన్నా (Tamannaah Bhatia) గిఫ్ట్ హ్యాంపర్ పట్టుకుని లోపలికి వెళ్లింది.
బిగ్ బాస్ (Telugu Biggboss) వేదికపై పింక్ సూట్ లో మెరిసిన తమన్నా (Tamannaah Bhatia) గిఫ్ట్ హ్యాంపర్ పట్టుకుని లోపలికి వెళ్లింది.

తెలుగు బిగ్ బాస్ హౌస్ లో (Telugu Biggboss) ఆదివారం ఎపిసోడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) సందడి చేసింది. తమన్నా ప్రస్తుతం తాను నటించిన 'బబ్లీ బౌన్సర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కి చేరుకొని బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది. ఆమె చేతిలో ఓ కానుక పెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి పంపాడు హోస్ట్ నాగార్జున. 

అంతకంటే ముందు.. బిగ్ బాస్ స్టేజ్ పైన నాగార్జున (Host Nagarjuna) తమన్నాని టీజ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ "తమన్నా ఏంటి ఆ ట్రాన్స్ ఫర్మేషన్.. ఎక్కడ కొడతావో అని భయం వేస్తుంది" అంటూ ఫన్నీగా అడిగారు. అమాయకత్వం ఒక కేరక్టర్ లో చూపించడం చాలా డిఫికల్ట్ అన్న తమన్నాతో అవును నీకది లేదుగా అంటూ టీజ్ చేయడం తాజాగా విడుదలయిన బిగ్ బాస్ ప్రోమోలో హైలెట్ అయింది.

బిగ్ బాస్ వేదికపై పింక్ సూట్ లో మెరిసిన తమన్నా (Tamannaah Bhatia) గిఫ్ట్ హ్యాంపర్ పట్టుకుని లోపలికి వెళ్లింది. నాగార్జున ‘ఇక్కడ ఉన్న ప్రతి అబ్బాయి.. హౌస్‌లో ఉన్న ఒకమ్మాయిని తమ బౌన్సర్ గా ఎంచుకోవచ్చు’ అని చెప్పారు. దానికి వెంటనే తమన్నా ‘వై షుడ్ బాయ్స్ హేవ్ ఆల్ ద ఫన్’ అని ప్రశ్నించింది. 

ఇక, తమన్నా బిగ్ బాస్ హౌస్ (Biggboss Season 6) లోకి అడుగుపెట్టగానే.. హౌస్ మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అబ్బాయిలు, అమ్మాయిలని బాక్సర్స్ గా ఎంచుకోమనగానే చంటి ఫైమా ని ఎంచుకున్నాడు. తర్వాత రాజ్ పై కామెడీ చేశాడు చంటి. ఎక్కడ రాజ్ ఫైమాకి బ్యాండ్ పెడతాడో అనగానే ఎందుకు అన్నారు నాగ్.. రాజ్ ఎవరికీ భయపడడు, కానీ ఫైమాకి భయపడతాడు. అందుకే దుప్పటి కప్పుకుంటాడని చెప్పుకొచ్చాడు.  

అర్జున్ కళ్యాణ్ (Arjun Kalyan) తన బౌన్సర్ గా శ్రీ సత్యను ఎంచుకున్నాడు. శ్రీ సత్య (Sri Satya) పేరు చెప్పగానే బయట ఉన్న ప్రేక్షకులు గట్టిగా అరిచారు. దానికి నాగార్జున ‘ఏమిటా స్పందన ఇక్కడ’ అన్నారు. దానికి ఒక యువతి ‘ఏదో ఉంది’ అంటూ కామెంట్ చేసింది. దానికి నాగార్జున ‘అర్జున్ కళ్యాణ్ విషయంలోనా’ అని అడిగారు. దానికి అర్జున్ అదో రకంగా ముఖం పెట్టాడు. దానికి వెనుక ఉన్న మిగతా కంటెస్టెంట్లు ‘కమల్ హాసన్’ అని కామెంట్ చేశారు. 

ఇక తమన్నా (Tamannaah Bhatia) అయితే.. ఎన్ని సినిమాల్లో మేము యాక్ట్ చేయలేదు. మొదట్లో ఫ్రెండ్స్ తర్వాత.. అంటూ వారిని మరింత ఎంకరేజ్ చేసింది. ఈ దెబ్బతో నిజంగానే వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా లేదా చూడాలి. 

Read More: బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి (Ashu Reddy) పుట్టిన రోజు వేడుకలో సందడి చేసిన బిగ్ బాస్ (Biggboss) మాజీ కంటెస్టెంట్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!