బిగ్ బాస్ సీజన్ 6 (BiggbossSeason6) లో కన్నీళ్లు పెట్టించిన కంటెస్టెంట్స్ సుదీప, కీర్తి, రోహిత్-మెరీనా..!

Updated on Sep 16, 2022 05:44 PM IST
పిల్లలతో తమకు తమ పర్సనల్ లైఫ్ లో ఎలాంటి బాండింగ్ ఉంటుందో ప్రేక్షకులకూ.. తోటి ఇంటి సభ్యులకూ వివరించాలని బిగ్ బాస్ (Telugu Biggboss) తెలిపాడు.
పిల్లలతో తమకు తమ పర్సనల్ లైఫ్ లో ఎలాంటి బాండింగ్ ఉంటుందో ప్రేక్షకులకూ.. తోటి ఇంటి సభ్యులకూ వివరించాలని బిగ్ బాస్ (Telugu Biggboss) తెలిపాడు.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) మొదలై రెండు వారాలు పూర్తి కావడానికి వస్తోంది. ఈ నేపథ్యంలో హౌస్ మేట్స్ అందరూ కూడా ఒకరికొకరు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో 11వరోజు ఎంతో ఎమోషన్స్ తో నిండిపోయింది. 12వ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ ఏడుస్తూ ప్రేక్షకుల్ని ఏడిపించేశారు. 

బిగ్ బాస్ సీజన్ 6 లో రెండవ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సిసింద్రీ టాస్క్ తర్వాత హౌస్ లో ఉన్న వారి లైఫ్ పిల్లల వల్ల ఎలా మారింది.. పిల్లలతో తమకు తమ పర్సనల్ లైఫ్ లో ఎలాంటి బాండింగ్ ఉంటుందో ప్రేక్షకులకూ.. తోటి ఇంటి సభ్యులకూ వివరించాలని బిగ్ బాస్ (Telugu Biggboss) తెలిపాడు. దీంతో కంటెస్టెంట్స్ ఒకొక్కరు తమ జీవితంలో జరిగిన కన్నీటి గాధలను వివరించారు. కొంతమంది పిల్లలను ఎలా కోల్పోయారో చెప్పి కంటతడి పెట్టించారు. 

  1. మొదటగా ఆదిరెడ్డి (Aadi Reddy) ఈ ఎమోషనల్ జర్నీని స్టార్ట్ చేశాడు. తన కూతురు అద్విత అని.. తనకి పిల్లలంటే ఇష్టం ఉండదని చెప్పాడు. ఇప్పటికీ తన భార్య డెలివరీ రోజు పక్కన లేనని బాధపడుతూనే ఉంటుందని చెప్పాడు. 
  2. తన చెల్లెలు బ్లైండ్ కావడంతో.. తన కూతురు కూడా అలాగే పుట్టిందని చాలామంది బంధువులు అన్నారనీ.. ఆరోజున చాలా బాధపడ్డానని చెప్పాడు ఆదిరెడ్డి. చివరగా అంతా బాగా జరిగితే.. ఇదే హౌస్‌లో తన పాప కూడా నడుస్తుందని చెప్పాడు ఆదిరెడ్డి (Aadi Reddy).
  3. ఆ తర్వాత సుదీప (Actress Sudeepa) తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్పి అందరి కళ్లు చెమ్మగిల్లేట్టు చేసింది. 2015లో తన బేబీని కోల్పోయానని, తమ చెల్లి కూతుర్ని తిరిగివ్వడానికి మనసొప్పలేదని చెప్తూ.. ఎమోషనల్ అయింది. 
  4. అందరి పిల్లలు.. నా దగ్గరకు వస్తారు.. నా పిల్లలే నా చేతికి రావడం లేదని.. అది ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు.. భవిష్యత్తులో నేను తల్లవుతానిని అనుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అయ్యింది సుదీప (Actress Sudeepa). ఇక, ఆమె తన ‌బిడ్డ కోసం పడిన ఆవేదన అందరి కళ్లు చెమ్మగిల్లేట్టు చేసింది.
  5. సింగర్ రేవంత్ (Singer Reveanth).. తనకు పుట్టబోయే బేబీ గురించి మాట్లాడుతూ.. ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకుందామా అని వెయిట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు.
  6. ఇక, హౌస్ మొత్తంలో కీర్తి భట్ (Keerthy Bhatt) కథ అందరినీ ఏడిపించేసింది. తన కళ్లెదుటే.. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, పాప అందరూ యాక్సిడెంట్ లో చనిపోగా.. తానొక్కదాన్నే బ్రతికానని చెప్పింది. 
  7. సొంతింట్లో ఉండలేక.. బెంగళూరుకు వచ్చినపుడు తినడానికి తిండిలేక, పెట్టేవాళ్లు లేక.. కుక్కలకు వేసిన బ్రెడ్ తిన్నరోజులను గుర్తుచేసుకుంది కీర్తి భట్ (Keerthy Bhatt). 
  8. ఒకపాపను దత్తత తీసుకుని పెంచగా.. ఆ పాపకూడా బిగ్ బాస్ కు వచ్చేముందే అనారోగ్యంతో కన్నుమూసిందని తెలిపింది.
  9. యాక్సిడెంట్ సమయంలో తన గర్భసంచిని తొలగించడంతో.. జీవితంలో పెళ్లి చేసుకున్నా కూడా తానిక పిల్లల్ని కనలేనని, మరోపాపను దత్తత తీసుకుని పెంచుతానని చెప్పింది కీర్తి (Keerthy Bhatt).
  10. చలాకీ చంటి (Chalaki Chanti) తన తల్లి, కూతుర్లను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు. 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!