ధనుష్‌తో (Dhanush) సినిమా చేసే ఆలోచనలో ఉన్నామంటున్న హాలీవుడ్ దర్శకులు! ‘ది గ్రే మ్యాన్’ ప్రీమియర్స్‌లో వెల్లడి

Updated on Jul 21, 2022 05:43 PM IST
రూసో బ్రదర్స్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది గ్రే మ్యాన్ సినిమా ప్రీమియర్స్‌లో పంచెకట్టులో ధనుష్ (Dhanush)
రూసో బ్రదర్స్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది గ్రే మ్యాన్ సినిమా ప్రీమియర్స్‌లో పంచెకట్టులో ధనుష్ (Dhanush)

రఘువరన్‌ బీటెక్, వీఐపీ, మారి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు ధనుష్ (Dhanush). ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ధనుష్.. తక్కువ సమయంలోనే మంచి నటుడిగా ఎదిగారు. సర్‌‌ అనే సినిమాతో తెలుగులో కూడా డైరెక్ట్‌ సినిమా చేస్తున్నారు ధనుష్.

తమిళం, తెలుగుతోపాటు హిందీలో కూడా సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న ధనుష్.. హాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టారు. హాలీవుడ్‌లో ధనుష్‌ నటించిన మొదటి సినిమా ‘ది గ్రే మ్యాన్’. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ది గ్రే మ్యాన్ సినిమా జూలై 22వ తేదీని రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ధనుష్‌ అవిక్‌ సాన్‌ అలియాస్ లోన్‌ ఉల్ఫ్‌ అనే కాంట్రాక్ట్‌ కిల్లర్‌‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు రూసో బ్రదర్స్‌ దర్శకత్వం వహించారు.

ది గ్రే మ్యాన్ యూఎస్ ప్రీమియర్స్‌కు కొడుకుతో హాజరైన ధనుష్ (Dhanush)

ముంబైలో ప్రీమియర్స్‌...

ది గ్రే మ్యాన్ సినిమా ప్రమోషన్ల కోసం ముంబై వచ్చిన రూసో బ్రదర్స్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ధనుష్‌ గురించి వాళ్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ధనుష్‌ నటించిన లోన్‌ ఉల్ఫ్‌ క్యారెక్టర్‌‌తో స్పెషల్‌గా సీక్వెల్‌ కానీ, మరో సినిమాను కానీ తెరకెక్కించనున్నట్టు తెలిపారు.

ధనుష్‌ను ఎక్కువ సమయం స్ర్కీన్‌పై చూడాలని అనుకుంటన్నామని హాలీవుడ్‌లో చాలా మంది మెసేజ్‌లు పెడుతున్నారని రూసో బ్రదర్స్.. జోయ్ రూసో, ఆంథోనీ రూసో చెప్పారు.

రూసో బ్రదర్స్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది గ్రే మ్యాన్ సినిమా ప్రీమియర్స్‌లో పంచెకట్టులో ధనుష్ (Dhanush)

తప్పకుండా నటిస్తా: ధనుష్‌ (Dhanush)

ధనుష్‌   కూడా ఈ దర్శకులతో మరో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్టు వెల్లడించారు. వాళ్లు ఒక్క ఫోన్‌ చేస్తే వాళ్లు తెరకెక్కించే సినిమాలో తప్పకుండా నటిస్తానని చెప్పారు. ఇక, ధనుష్‌ నటించిన హాలీవుడ్‌ సినిమా ‘ది గ్రే మ్యాన్’లో స్టార్ యాక్టర్లు ర్యాన్ గ్యాస్లింగ్, క్రిస్ ఇవాన్స్‌ కీలక పాత్రలు పోషించారు.

కాగా, ధనుష్‌ (Dhanush)   నటించిన ది గ్రే మ్యాన్‌ సినిమా ప్రీమియర్‌‌ షో ముంబైలో ప్రదర్శించారు. మార్క్‌ గ్రేనీ రాసిన నవల ఆధారంగా ది గ్రే మ్యాన్ సినిమాను తెరకెక్కించిన రూసో బ్రదర్స్.. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్‌ గేమ్ వంటి సూపర్‌‌ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు.

Read More : ఓటీటీలోకి మాధవన్‌ (Madhavan) ‘రాకెట్రీ’ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎందులో, ఎప్పటి నుంచి అంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!