Movie Review : వీజే సన్నీ (VJ Sunny) ‘సకల గుణాభి రామ’ సినిమా.. మంచి లక్షణాలున్నా షరతులు వర్తిస్తాయి

Updated on Sep 16, 2022 09:59 PM IST
బిగ్ బాస్ తెలుగు 5 సీజ‌న్ విన్న‌ర్‌ వీజే స‌న్నీ (VJ Sunny) హీరోగా నటించిన సినిమా సకల గుణాభి రామ.
బిగ్ బాస్ తెలుగు 5 సీజ‌న్ విన్న‌ర్‌ వీజే స‌న్నీ (VJ Sunny) హీరోగా నటించిన సినిమా సకల గుణాభి రామ.

సినిమా : సకల గుణాభిరామ

నటీనటులు: వీజే సన్నీ , అసిమా, శ్రీతేజ్, తరుణీ సింగ్

సంగీతం: అనుదీప్ దేవ్

నిర్మాత: సంజీవ్ రెడ్డి వడ్డి

దర్శకుడు: వెలిగొండ శ్రీనివాస్

విడుదల తేదీ : 16–09–2022

రేటింగ్ : 2.5 / 5

బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ (VJ Sunny) హీరోగా నటించిన సినిమా సకల గుణాభి రామ. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా  తెరకెక్కింది. సన్నీ హీరోగా మొదటిసారి నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. మరి సకల గుణాభి రామ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి..

కథ ఏంటంటే :

అభి రామ్ (వీజే సన్నీ) ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మిడిల్ క్లాస్ అబ్బాయి. స్వాతి (అషిమా)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితం బాగానే ఉన్నా..  వచ్చే జీతం సరిపోక వడ్డీ వ్యాపారం చేసే ప్రదీప్ (శ్రీ తేజ్) దగ్గర అప్పు తీసుకుని వాటిని తీర్చలేక ఇబ్బంది పడుతుంటాడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పుడే పిల్లలు వద్దని నిర్ణయించుకుంటారు రామ్, స్వాతి. రామ్‌కు ఇష్టం లేకపోయినా.. భార్య కోసం పిల్లలను కనడం వాయిదా వేస్తుంటారు. అనుకోకుండా జరిగిన ఒక సంఘటనతో స్వాతి పుట్టింటికి వెళిపోతుంది. స్వాతి తిరిగి వచ్చిందా?  రామ్‌ ఎందుకు అలా ప్రవర్తించాడు? స్వాతి పుట్టింటికి వెళ్లిన తరువాత రామ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.

బిగ్ బాస్ తెలుగు 5 సీజ‌న్ విన్న‌ర్‌ వీజే స‌న్నీ (VJ Sunny) హీరోగా నటించిన సినిమా సకల గుణాభి రామ.

ఎలా ఉందంటే?

మిడిల్ క్లాస్ అబ్బాయిల చుట్టూ తిరిగే కథలు ఆసక్తికరంగా ఉంటాయి. చాలా మంది జీవితాలు వీటికి బాగా కనెక్ట్‌ అవుతాయి. కథ సరదాగా ఫన్నీగా సాగిపోతున్నట్టుగా అనిపిస్తున్నా.. ఎమోషన్స్ కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. అయితే అవి అంతగా కనెక్ట్ కావడం లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం.. హీరో పని చేసే కంపెనీ, సరదా సాగిపోయే సన్నివేశాల నేపథ్యంలో కథ సాగుతుంది. కొలీగ్స్, మేనేజర్‌‌తో తెరకెక్కించిన సన్నివేశాలు సరదాగా ఉంటాయి.

మరొక స్త్రీతో రామ్‌కు పరిచయం ఏర్పడడంతో రామ్ ఎటువంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది బాగా చూపించారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాద. ఏవైనా పొరపాట్లు జరిగితే, వాటిని క్షమించి జీవితాంతం కలిసి ఉండాలని మెసేజ్‌ కూడా ఇచ్చారు దర్శకుడు. అయితే ఈ విషయాన్ని మరింత బలంగా చెప్పి ఉంటే బాగుండేది.

సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ స్వరాలు అంతగా ఆకట్టుకోలేదు. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపించింది. దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మంచి కథ రాసుకున్నా.. కథనాన్ని నడిపించడంలో మాత్రం సక్సెస్ కాలేదు.  

ఎవరు ఎలా చేశారంటే..

వీజే సన్నీ తన పరిధిలో బాగానే నటించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా, భర్తగా రెండు పాత్రల్లోనూ మెప్పించారు. కామెడీతోపాటు అమాయకంగా ఉండే పాత్రలో  అలరించాడు.హీరోయిన్ అషిమ పాత్రకి తగ్గట్టుగా నటించారు. విలన్ భార్యగా తరుణీ సింగ్ బాగానే నటించారు. సెవెన్ ఆర్ట్స్ సరయు బోల్డ్ పాత్రలో కనిపించి మెప్పించారు. విట్టా మహేష్ కామెడీ ఫర్వాలేదనిపించింది.

ప్లస్ పాయింట్స్ 

వీజే సన్నీ (VJ Sunny)  నటన

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ 

స్క్రీన్ ప్లే, సంగీతం

ఒక్కమాటలో.. ‘సకల గుణాభి రామ’కు షరతులు వర్తిస్తాయి

Read More : Movie Review: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన "నేను మీకు బాగా కావాల్సిన వాడిని" సినీ సమీక్ష !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!