స‌న్నీ మ‌చ్చా (VJ Sunny) కొత్త సినిమా డైరెక్ట‌ర్ డైమండ్ ర‌త్న‌బాబు అట‌!

Updated on May 28, 2022 11:13 PM IST
ద‌ర్శ‌కుడిగా డైమండ్ ర‌త్న‌బాబు వీజీ స‌న్నీ(VJ Sunny)తో మూడో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
ద‌ర్శ‌కుడిగా డైమండ్ ర‌త్న‌బాబు వీజీ స‌న్నీ(VJ Sunny)తో మూడో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

బిగ్ బాస్ తెలుగు 5 సీజ‌న్ విన్న‌ర్‌గా నిలిచాడు వీజే స‌న్నీ (VJ Sunny). అన్నీ ఎమోష‌న్స్‌తో వీజే స‌న్నీ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. బిగ్ బాస్‌లో విన్న‌ర్‌గా నిలిచిన స‌న్నీ టాలీవుడ్‌పై ఫోక‌స్ చేశారు. వెండితెర‌పై త‌న న‌ట విశ్వ‌రూపం చూపించేందుకు రెడీ అయ్యారు. వ‌రుస సినిమాల‌తో స‌న్నీ బిజీ బిజీగా ఉన్నారు. అయితే స‌న్నీ చేస్తున్న కొత్త ప్రాజెక్టుల వివ‌రాలు ఇంట్ర‌స్టింగ్‌గా అనిపిస్తున్నాయి.

ప‌క్కా ఎంట‌ర్‌ట్రైన్ సినిమా అట‌
మ‌చ్చా అంటూ మాస్ ఫాలోయింగ్ పెంచుకున్న వీజే స‌న్నీ (VJ Sunny) సినిమాల‌పై దృష్టి పెట్టారు. మాస్ హిట్ కోసం ట్రై చేస్తున్నారు. డైమండ్ ర‌త్న‌బాబు డైరెక్ష‌న్‌లో వీజే స‌న్నీ ఓ సినిమా చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు ర‌త్న‌బాబు అధికారికంగా తెలిపారు. త్వ‌ర‌లో స‌న్నీ కొత్త సినిమా ప్రారంభం కానుంద‌ట‌. ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌ట‌. సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం వంటి చిత్రాలకు డైలాగ్ రైట‌ర్‌గా డైమండ్‌ రత్నబాబు ప‌ని చేశారు. బుర్ర‌క‌థ‌, స‌న్నాఫ్ ఇండియా సినిమాల‌కు ద‌ర్శ‌కుడిగా ర‌త్న‌బాబు వ్య‌వ‌హ‌రించారు. ద‌ర్శ‌కుడిగా వీజీ స‌న్నీతో మూడో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ద‌ర్శ‌కుడిగా డైమండ్ ర‌త్న‌బాబు వీజీ స‌న్నీ(VJ Sunny)తో మూడో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

స‌న్నీ మొద‌టి సినిమా త్వ‌ర‌లో రిలీజ్

వీజీ స‌న్నీ(VJ Sunny) హీరోగా మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్  చేస్తున్నార‌ట‌. అలాగే స‌న్నీతో క‌లిసి న‌టించే హీరోయిన్ ఎవ‌రో త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తార‌ట‌.  స‌న్నీ మరోవైపు 'స‌క‌ల గుణాభిరామ' సినిమా చేస్తున్నారు. రైట‌ర్ వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో 'స‌క‌ల గుణాభిరామ' తెర‌కెక్కుతుంది. ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 'స‌క‌ల గుణాభిరామ' ట్రైల‌ర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వ‌ర‌లోనే బిగ్ బాస్ విజేత స‌న్నీ మొద‌టి సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.  ఇదే క్రమంలో, డైమండ్ ర‌త్న‌బాబు తీస్తున్న స‌న్నీ రెండో సినిమా వివ‌రాలు ఓ వారంలో ప్ర‌క‌టిస్తార‌టని టాక్. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!