ఎఫ్ 3 (F3) : పిచ్చ కామెడీ.. పిచ్చ కాంబినేషన్ .. రచ్చ రచ్చ చేస్తున్న వెంకీ, వరుణ్ తేజ్ అభిమానులు

Updated on May 01, 2022 06:12 PM IST
వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ రిపీట్ చేస్తూ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో వ‌స్తున్న సినిమా ఎఫ్ 3 . ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎఫ్ 2  చిత్రానికి మించి  ఫ‌న్ అందించారు. ఈ చిత్రం మే 27న థియేటర్లలో సంద‌డి చేయ‌నుంది. ఎఫ్ 3 పాన్ ఇండియా సినిమా కాక‌పోయినా... పక్కా పైసా వసూల్ ఎంటర్‌టైనర్ ఉంటుంద‌ట‌.
వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ రిపీట్ చేస్తూ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో వ‌స్తున్న సినిమా ఎఫ్ 3 . ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎఫ్ 2  చిత్రానికి మించి ఫ‌న్ అందించారు. ఈ చిత్రం మే 27న థియేటర్లలో సంద‌డి చేయ‌నుంది. ఎఫ్ 3 పాన్ ఇండియా సినిమా కాక‌పోయినా... పక్కా పైసా వసూల్ ఎంటర్‌టైనర్ ఉంటుంద‌ట‌.

స‌ర‌దాగా సాగిపోయే సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఇష్ట‌ప‌డ‌తారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా వ‌చ్చిన ఎఫ్ 2 సినిమా ఆడియ‌న్స్‌కి సూప‌ర్‌గా న‌చ్చేసింది. వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ రిపీట్ చేస్తూ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి డైరెక్ష‌న్లో వ‌స్తున్న సినిమా ఎఫ్ 3 .

ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎఫ్ 2  చిత్రానికి మించి వెంక‌టేశ్, వ‌రుణ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు ఈ సినిమాకు ఫ‌న్ అందించారు. ఈ చిత్రం మే 27న థియేటర్లలో సంద‌డి చేయ‌నుంది. ఎఫ్ 3 పాన్ ఇండియా సినిమా కాక‌పోయినా... పక్కా పైసా వసూల్ ఎంటర్‌టైనర్ అవుతుందట. 
 

హీరోలేమ‌న్నారు

ఎఫ్ 3 లో చాలా క్రేజీగా క‌నిపిస్తాన‌ని వెంక‌టేశ్ అన్నారు. త‌న యాక్టింగ్ ఇంకా ఇంకా క్రేజీగా ఉంటుంద‌న్నారు. ఎఫ్ 2 లో వెంకీ ఆసనం ఎంత పాపుల‌ర‌యిందో, అంత‌కు మించి పాపుల‌ర్ ఎలిమెంట్ ఎఫ్ 3లో క‌నిపిస్తుంద‌ట‌. గని ప్రమోషన్స్‌లోనే చాలామంది వరుణ్‌ను ఎఫ్3 మూవీ గురించి అడిగారు. ఎఫ్3 సినిమా చూస్తున్నంతసేపు ఎవ్వరూ సీట్లలో కూర్చోరని ... అంత పతాక స్థాయిలో కామెడీ ఉంటుంద‌ని ఆయన చెప్పారు. యాక్ట్  చేసిన తానే చాలా ఎంజాయ్ చేస్తుంటే... ప్రేక్షకులు దానికి రెట్టింపు ఎంజాయ్ చేయ‌డం గ్యారెంటీ అన్నారు వ‌రుణ్.

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం..

ఈ సినిమాలో వెంక‌టేశ్‌కి రేచిక‌టి, వ‌రుణ్‌కు న‌త్తి ఉంటుంది. హ‌నీ ఈజ్ ది బెస్ట్‌ లానే పాపుల‌ర్ కొటేషన్ కూడా ఒకటి ఉంటుంద‌ని డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి అన్నారు. ఈవీవీ సినిమాలు మ‌నం మిస్ అవుతున్నామ‌ని, కానీ ఈ చిత్రాన్ని వీక్షిస్తే,, అలాంటి సినిమాలు మ‌ళ్లీ చూసిన ఫీలింగ్ ఉంటుంద‌న్నారు. ఎఫ్ 2 కంటే ఎఫ్ 3 బ‌డ్జెట్ ప‌రంగా చాలా పెద్ద‌ద‌ని చెప్పారు. ఈ ఏడాది సంక్రాతికి రిలీజ్ అయితే, త‌న‌కు ఓ మెమోరీగా మిగిలేద‌న్నారు. ఈ చిత్రంలో సునీల్, వెన్న‌ెల కిషోర్‌తో పాటు ప‌లువురు క‌మెడియ‌న్స్ కూడా న‌టించార‌ని చెప్పారు. 

అహ నా పెళ్లంట గుర్తుకొస్తుందట

ఎఫ్ 3 లో తన అభిమాన నటుడు రాజేంద్రప్రసాద్ కోసం ఒక వైవిధ్యమైన పాత్రను డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. ఈ పాత్ర అచ్చం అహనా పెళ్లంట సినిమాలోని కోట శ్రీనివాసరావు పాత్రను పోలి ఉంటుందట. ఇలా మొదటి భాగంతో పోల్చుకుంటే.. రెండవ భాగంలో కథా  మార్పులు భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా సీక్వెల్ కాదని, అవే పాత్రలతో రాసుకున్న కొత్త కథ అని అనిల్ రావిపూడి తెలిపారు. 

దుమ్ము రేపే మ్యూజిక్

ఈ సినిమాలో సంగీతానిది కూడా ప్రధాన స్థానం అంటున్నారు నిర్మాతలు. ముఖ్యంగా దేవీప్రసాద్ ఒక డిఫరెంట్ మ్యూజిక్ అందించడానికి ప్రయత్నించారని టాక్. లబ్ డబ్ లబ్ డబ్ డబ్బోకి భాస్కరభట్ల అందించిన లిరిక్స్ వెరైటీగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కైవసం చేసుకోగా, డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ కైవసం చేసుకోవడం విశేషం. 

స్పెషల్ సర్ ప్రైజ్

సోనాల్ చౌహాన్ ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని టాక్. ఆ పాత్ర ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే ప్రముఖ కథానాయిక పూజా హెగ్డే ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో నటించడానికి ఒప్పుకున్నారు. 

పాన్ ఇండియా సినిమా కాక‌పోయినా.. పక్కా పైసా వసూల్ ఎంటర్‌టైనర్‌గా ఎఫ్3 ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కోట్ చేశారు. ఇలాంటి ఎంట‌రైన్ సినిమా కోసం ప్రేక్ష‌కులు వెయిట్ చేస్తున్నారన్నారు, 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!