మరో డిఫరెంట్‌ టైటిల్‌తో ఉపేంద్ర (Upendra) సినిమా.. పాన్‌ ఇండియా సినిమాగా ‘UI’

Updated on Jun 03, 2022 06:09 PM IST
ఉపేంద్ర (Upendra) కొత్త సినిమా పోస్టర్
ఉపేంద్ర (Upendra) కొత్త సినిమా పోస్టర్

కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra) మరో విలక్షణమైన టైటిల్‌తో సినిమా చేయబోతున్నాడు. ‘UI’ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెర్సటైల్ యాక్టర్‌‌గా, డైరెక్టర్‌‌గా యాక్టింగ్‌లో తనదైన ముద్ర వేసుకున్న ఉపేంద్ర,, అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యాడు ఉపేంద్ర. ఏ, రా సినిమాలతో ట్రెండ్ సెట్‌ చేసిన ఉపేంద్ర.. విలక్షణ నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు.

2015వ సంవత్సరంలో వచ్చిన ఉపేంద్ర2 సినిమా తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టుకోలేదు. చాలా కాలం తర్వాత మరో భారీ ప్రాజెక్టుతో ఉపేంద్ర మరోసారి డైరెక్షన్‌ చేయబోతున్నాడు. ‘UI’ అనే డిఫరెంట్ టైటిల్​తో ఈ సినిమా తెరకెక్కుతోంది. జూన్ 3వ తేదీన పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్టు ప్రొడ్యూసర్స్ ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలనికి కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, కిచ్చా సుదీప్, విజయ్ హాజరయ్యారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఉపేంద్ర. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా ఉపేంద్రనే.

ఇటీవల ‘గని’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఉపేంద్ర.. రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో మల్టీ లింగ్వువల్‌ సినిమా చేస్తున్నాడు ఉపేంద్ర. ఉపేంద్ర సినిమాలన్నీ లోతైన కథ, కథనాలతోనే తెరకెక్కుతాయి. అంతేకాకుండా ఆ సినిమాలకు చెందిన టైటిల్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఐఎండీబీ వరల్డ్ టాప్ 50 డైరెక్టర్స్‌లో ఉపేంద్రకు చోటు దక్కిందంటే ఆయన క్రియేటివిటీ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Read More: ఓటీటీ రిలీజ్‌ కోసమే బాలీవుడ్‌ సినిమాలు తీసే రోజులు వచ్చేలా ఉన్నాయన్న ఆర్జీవీ (RGV).. కామెంట్లు వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!