ఓటీటీ రిలీజ్‌ కోసమే బాలీవుడ్‌ సినిమాలు తీసే రోజులు వచ్చేలా ఉన్నాయన్న ఆర్జీవీ (RGV).. కామెంట్లు వైరల్

Updated on May 13, 2022 06:19 PM IST
రాంగోపాల్‌ వర్మ (RGV)
రాంగోపాల్‌ వర్మ (RGV)

రాంగోపాల్‌ వర్మ (RGV) ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏ సినిమా అనౌన్స్ చేసినా, సినిమా తీసినా, సినిమా రిలీజ్‌ చేస్తున్నా అన్నీ సంచలనమే. ఇటువంటి సంచలన డైరెక్టర్ ప్రస్తుతం బాలీవుడ్‌పై కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. బాలీవుడ్‌పై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఆర్జీవీ తాజాగా చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌, పుష్ప, కేజీఎఫ్‌  సినిమాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజై ఘన విజయం సాధించాయి. వందల కోట్లు వసూళ్లు చేశాయి. దీంతో బాలీవుడ్‌ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని కామెంట్లు ఆర్జీవీ. ఆ తర్వాత రీమేక్స్‌పై ఆసక్తి చూపించకుండా.. కథను అందులోని కంటెంట్‌ను నమ్ముకోవాలని మరోసారి విమర్శలు చేశాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఆర్జీవీ బాలీవుడ్‌పై చేసిన కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి.

సౌత్‌ సినిమాలు దక్షిణాదిలో ఘన విజయం సాధించి, వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఉత్తరాది చిత్రాలు విలవిలలాడిపోతున్నాయి. త్వరలోనే బాలీవుడ్‌ కేవలం ఓటీటీలో రిలీజ్‌ చేసుకునేందుకు మాత్రమే సినిమాలు తీసే రోజులు వచ్చేలా ఉన్నాయి’ అని ఆర్జీవీ అన్నాడు.

ఇటీవల హిందీ భాష విషయంలో కన్నడ స్టార్ యాక్టర్‌‌ కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్‌ అయ్యాయి. దీనిపై అజయ్‌ దేవ్‌గణ్‌ స్పందించారు కూడా. ఈ ఇద్దరు స్టార్ల మధ్య కొంత వాడివేడి చర్చ కూడా జరిగింది. తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్స్‌లో సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు తనను బాలీవుడ్ భరించలేదు అని చేసిన కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. దీనిపై వర్మ (RGV), బోనీ కపూర్, కంగనా రనౌత్‌ స్పందించారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!