ఎఫ్3 (F3) నాలుగు రోజుల్లో అంత వ‌సూళ్లు చేసిందా!

Updated on May 31, 2022 08:05 PM IST
ఎఫ్‌2 సినిమాకు సీక్వెల్‌గా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి (Anil Ravipud) ఎఫ్ 3(F3)మూవీ నాలుగు రోజుల్లో  రూ. 73కోట్ల గ్రాస్ వ‌సూళ్లు చేసింది
ఎఫ్‌2 సినిమాకు సీక్వెల్‌గా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి (Anil Ravipud) ఎఫ్ 3(F3)మూవీ నాలుగు రోజుల్లో  రూ. 73కోట్ల గ్రాస్ వ‌సూళ్లు చేసింది

వెంక‌టేష్ (Victory Venkatesh ), వ‌రుణ్ తేజ్‌(Varun Tej) లు క‌లిసి న‌టించిన సినిమా ఎప్‌3 (F3). కామెడీ ఎంట‌ర్‌టైన్ సినిమా ఎఫ్3 మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతుంది. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో  రూ. 73కోట్ల గ్రాస్ వ‌సూళ్లు చేసింది. అనిల్ రావివూడి ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ్ అయిన‌ ఎఫ్3 బాక్సాఫీసును షేక్ చేస్తుంది. ఎఫ్2తో పోలిస్తే ఎఫ్3 క‌లెక్ష‌న్ కాస్త త‌క్కువ‌గానే ఉంది. 

ఎఫ్‌2 సినిమాకు సీక్వెల్‌గా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి (Anil Ravipud) ఎఫ్ 3(F3)మూవీ తీశారు. ఈ సినిమాకు శిరీష్, దిల్ రాజు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. ఎఫ్3 నాలుగు రోజుల కలెక్షన్‌ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమా నాలుగు రోజుల్లో 32.11కోట్ల షేర్‌ని రాబట్టింది.  నాల్గో రోజు కలెక్షన్లు చూస్తే, నైజాంలో రూ. 2.03కోట్లు, గుంటూరు రూ. 28లక్షలు, సీడెడ్ రూ. 71లక్షలు, నెల్లూరు రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 34లక్షలు, వెస్ట్ రూ. 20లక్షలు, కృష్ణ రూ. 28, యూఏలో రూ. 66లక్షలు వసూలు చేసింది. ఇక ఈ వారంలో కూడా ఎఫ్3 భారీగానే వ‌సూళ్లు చేస్తుంద‌ని టాక్. 

ఎఫ్‌3 (F3)లో వెంక‌టేష్, త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్, మెహ్రీన్‌లు న‌టించారు. సోనాల్‌ చౌహాన్ తో పాటు  పూజా హెగ్డే ఐటెమ్‌ సాంగ్ ఎఫ్3కి ప్ల‌స్ అంటున్నారు. ఇక వీరితో పాటురాజేంద్ర‌ప్ర‌సాద్, ముర‌ళీ శ‌ర్మ‌, సునీల్, వెన్నెల కిశోర్, అలీ, ర‌ఘుబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, ప్ర‌గ‌తి న‌టించారు. ఎఫ్2 కంటే ఎఫ్3 కామెడీ విష‌యంలో త‌క్కువేన‌ని అంటున్నారు కొంద‌రు. ఇక మ‌రికొంద‌రైతే ఏ సినిమాకు అదే కామెడీ పంచిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఎఫ్3 క‌లెక్ష‌న్ల‌తో నిర్మాత దిల్ రాజు ఫుల్ జోష్‌లో ఉన్నారు. 
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!