వివాదంలో సుధీర్ బాబు (Sudheer Babu) కొత్త సినిమా.. ‘హంట్’ (Hunt) టైటిల్ తనదేనంటున్న యంగ్ హీరో

Updated on Oct 18, 2022 04:26 PM IST
సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తున్న ‘హంట్’ (Hunt) చిత్రం టైటిల్ తనదేనని ఓ యంగ్ హీరో అన్నారు
సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తున్న ‘హంట్’ (Hunt) చిత్రం టైటిల్ తనదేనని ఓ యంగ్ హీరో అన్నారు

వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు సుధీర్ బాబు (Sudheer Babu). ఏదో ఒక్క జోనర్‌కే పరిమితం కాకుండా విభిన్నమైన చిత్రాల్లో కనిపించడం ఆయన స్పెషాలిటీ. పాత్ర నచ్చితే సెకండ్ హీరోగా నటించడానికీ సుధీర్ బాబు వెనుకాడరు. అందుకు నేచురల్ స్టార్ నానితో కలసి నటించిన ‘వీ’ మూవీనే ఉదాహరణ. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోవడం ఆయనకు ఇష్టం ఉండదు. అందుకేనేమో ఇన్ని డిఫరెంట్ ఫిల్మ్స్‌లో సుధీర్ బాబు కనిపిస్తున్నారు. 

సుధీర్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘హంట్’ (Hunt). ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన ‘పాపతో పైలం’ పాట కూడా అందర్నీ ఆకట్టుకుంటోంది. అయితే ‘హంట్’ మూవీ టైటిల్‌పై ఇప్పుడు వివాదం తలెత్తింది. ఈ టైటిల్ తనదేనని యంగ్ హీరో, డైరెక్టర్ నిక్షిత్ అంటున్నారు. 

నిక్షిత్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నర్సింగ్ రావు, తల్లాడ సాయికృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘హంట్’ అనే టైటిల్ పెట్టారు. ‘హోమిసైడ్ అన్‌లాఫుల్ యాక్ట్ నేషనల్ టీమ్’ అనేది ట్యాగ్ లైన్. ఈ టైటిల్‌ను తాము ఆరు నెలల కిందే ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేసుకున్నామని నిర్మాత తల్లాడ సాయికృష్ణ తెలిపారు. ఇప్పుడు ఇదే టైటిల్‌తో భవ్య క్రియేషన్స్ వాళ్లు సుధీర్ బాబు సినిమా చేస్తున్నారని.. తాము రిజిస్టర్ చేసుకున్న టైటిల్‌ను ఎలా పెడతారని భవ్య క్రియేషన్స్‌ను అడిగామన్నారు. తమ టైటిల్‌ను హుందాగా కొట్టేశారని సాయికృష్ణ ఆరోపించారు. 

ఆ టైటిల్ మాదే

‘మా సినిమా టైటిల్ అయిన ‘హంట్’ను.. భవ్య క్రియేషన్స్ వాళ్లు సుధీర్ బాబుతో తీస్తున్న చిత్రానికి పెట్టుకున్నారు. వాళ్లు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఫిల్మ్ ఛాంబర్‌లో మేం ఆర్నెళ్ల కిందే ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నాం. మా టైటిల్‌ను మీరెలా పెట్టుకుంటారని భవ్య క్రియేషన్స్ వాళ్లను అడిగాం. ఫిల్మ్ ఛాంబర్‌లో మా సమస్యను తెలియజేశాం. భవ్య క్రియేషన్స్‌తో ఛాంబర్ సభ్యులు మాట్లాడినా ఎలాంటి పరిష్కారం లభించలేదు. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. మాకు న్యాయం కావాలి’ అని తల్లాడ సాయికృష్ణ డిమాండ్ చేశారు. మరి, ఈ టైటిల్ వివాదంపై భవ్య క్రియేషన్స్ నుంచి ఏమైనా స్పందన వస్తుందేమో చూడాలి.

ఇకపోతే, సుధీర్ బాబు ‘హంట్’ మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాలో తమిళ హీరో భరత్, టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. ఈమధ్య సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సుధీర్ బాబుకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. 

Read more: Sudheer Babu on completing 10 years in TFI : మహేష్‌‌తో మల్టీస్టారర్ చేయాలని ఉందట!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!