అప్పుడు నా మాట ఎవరూ నమ్మలేదంటున్న కమల్‌హాసన్ (Kamal Haasan).. రూ. 300 కోట్ల సంపాదనపై కామెంట్స్ !

Updated on Jun 16, 2022 05:57 PM IST
కమల్‌ హాసన్  (Kamal Haasan)
కమల్‌ హాసన్ (Kamal Haasan)

నాలుగేళ్ల తర్వాత పవర్‌‌ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చారు లోకనాయకుడు కమల్‌హాసన్ (Kamal Haasan). విక్రమ్‌ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద 'విక్రమ్' సినిమా భారీ వసూళ్లు చేయడంపై కమల్‌ హాసన్ స్పందించారు. చెన్నైలో జరిగిన ఒక ప్రెస్‌మీట్‌ ఆయన కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. 'ఇంత పెద్ద మొత్తంలో సంపాదిస్తానని ఇదివరకే చెప్పాను. అయితే అప్పుడు ఎవరూ పట్టించుకోలేదని.. తన మాటను ఎవరూ నమ్మలేదని' అన్నారు కమల్. 

‘ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే, డబ్బు విషయంలో ఎలాంటి చింతలేని నాయకుడు మనకు కావాలి. రూ.300 కోట్లు సంపాదిస్తానంటే ఎవరూ నా మాట నమ్మలేదు. అసలు వాళ్లు నా మాటల్ని అర్థం చేసుకోలేదు కూడా. ‘విక్రమ్‌’ వసూళ్లతో ఇప్పుడు నా మాట నిజమైంది. ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా.

నాకిష్టమైన ఆహారాన్ని తింటా. కుటుంబం, సన్నిహితులకు ఆర్థికంగా చేతనైనంత సాయం చేస్తా. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయాక.. ఇవ్వడానికి ఏమీ లేదని చెప్పేస్తా. వేరే వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని, పక్కన వాళ్లకి సాయం చేయాలనే ఉద్దేశం లేదు. మంచి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నా’ అని కమల్‌ హాసన్‌ తెలిపారు.

కమల్‌ హాసన్  (Kamal Haasan)

విక్రమ్ 2 పై క్లూ..

కాగా, 'విక్రమ్'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే సినిమా గురించిన చర్చే జరుగుతోంది. కమల్ హాసన్ తన నట విశ్వరూపాన్ని ఈ సినిమాతో మరోసారి చూపించారు. భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా మార్చడానికి నడుం బిగించే ఓ మాజీ 'రా' ఏజెంట్ కథ ఈ 'విక్రమ్'. ఈ చిత్రంలో కమల్ హాసన్ తన పాత్రలో ఒదిగిపోయారు. అలాగే నెగెటివ్ రోల్‌లో విజయ్ సేతుపతి కూడా తనదైన శైలిలో నటించారు. సూర్య స్పెషల్ ఎంట్రెన్స్ ఎపిసోడ్ అదుర్స్‌ అనే చెప్పాలి. అయితే .. 'విక్రమ్ 2' సినిమా కూడా ఉండబోతుందని ఈ సినిమా క్లైమాక్స్ ఓ క్లూ ఇచ్చింది.

Read More: విక్ర‌మ్ టీమ్‌కు పార్టీ ఇచ్చిన చిరంజీవి (Chiranjeevi) ! మ‌రి స‌ల్మాన్ ఖాన్ ఎందుకెళ్లారు?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!