'క్రేజీ ఫెలో'గా హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar) : ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

Updated on May 22, 2022 05:04 PM IST
ఆది సాయికుమార్ (Aadi Saikumar)
ఆది సాయికుమార్ (Aadi Saikumar)

హీరో  ఆది సాయికుమార్ (Aadi Saikumar) హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'క్రేజీ ఫెలో'. ఈ సినిమాతో ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ గురువారం విడుదల చేశారు. ఈ సినిమాలో ఆది కూల్‌ లుక్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు.

కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న 'క్రేజీ ఫెలో' సినిమాను సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌‌పై కేకే రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రాఫర్‪గా పని చేస్తున్నాడు.కాగా, క్రేజీ ఫెలో సినిమా ఫస్ట్‌ లుక్‌కు సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆది కొత్త లుక్‌ అందరినీ ఆకర్షిస్తోంది.

ఇక, 'ప్రేమ కావా'లి సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టిన ఆది సాయికుమార్‌‌.. ఫస్ట్‌ సినిమాతోనే హిట్‌ అందుకున్నాడు. తర్వాత మంచి సినిమాలు చేసి నటుడిగా పేరు తెచ్చుకున్నా.. సరైన కమర్షియల్‌ హిట్‌ మాత్రం ఆదికి దక్కలేదు. లవర్‌‌ బాయ్‌ ఇమేజ్‌తోపాటు, మాస్ ఇమేజ్‌ కోసం చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అయితే ప్రస్తుతం మళ్లీ తన రూటు మార్చినట్టు కనిపిస్తున్నాడు ఆది. పూర్తిగా లవర్‌‌బాయ్‌ గెటప్‌లో ఫ్రెష్‌గా కూల్‌ లుక్‌లోకి మారిపోయాడు. ఈసారైనా ఆది సాయికుమార్‌‌కు సరైన హిట్‌ రావాలని కోరుకుందాం.

సాయికుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆది సాయికుమార్ (Aadi Saikumar) , చాలాకాలం నుంచి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక చాలా సంవత్సరాలుగా టాలీవుడ్‌లో ఉన్న సాయికుమార్.. పోలీస్ స్టోరీ సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్‌లతో మరింతగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. యాక్టర్‌‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, బుల్లితెర యాంకర్‌‌గా కూడా సాయికుమార్‌‌ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!