బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సమంత (Samantha).. ఏకంగా సల్మాన్‌కు జోడీగా ఆఫర్ కొట్టేసిన సామ్‌?

Updated on Jun 23, 2022 12:35 AM IST
సల్మాన్ ఖాన్, సమంత
సల్మాన్ ఖాన్, సమంత

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత (Samantha) వరుస సినిమాలతో మరింత బిజీ హీరోయిన్‌గా మారింది. జెట్ స్పీడ్‌తో దూసుకుపోతూ.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలను లైన్‌లో పెడుతోంది. వాటిలో పాన్ ఇండియా సినిమాలు కూడా ఉండడం విశేషం. ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌తో ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది సామ్. ‘పుష్ప’ సినిమాలోని ప్రత్యేక పాటలో డ్యాన్స్‌ చేసి మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో సమంతకు బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా చాన్స్ వచ్చిందని టాక్.  బాలీవుడ్‌ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన కథానాయికగా అవకాశం కొట్టేసిందట సామ్‌. బాలీవుడ్‌లో సూపర్ హిట్టైన ‘నో ఎంట్రీ’ సినిమాకు సీక్వెల్ తీయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. 2005లో వచ్చిన ఈ సినిమాకు అనీజ్ బజ్మీ  దర్శకత్వం వహించాడు.

సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ పోస్టర్

‘పెళ్లాం ఊరెళితే’ హిందీ సీక్వెల్‌..

బోనీ కపూర్ నిర్మించిన నో ఎంట్రీ సినిమాలో సల్మాన్ ఖాన్,  అనీల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ హీరోలుగా నటించగా, బిపాషాబసు, ఇషా డియోల్, లారా దత్తా, సెలీనా జైట్లీలు కీలక పాత్రలు పోషించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెలుగులో వచ్చిన సూపర్ హిట్ ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాకు ఇది హిందీ వెర్షన్.  

ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘నో ఎంట్రీ 2’ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన సమంతను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసినట్టు టాక్. సీక్వెల్‌లో కూడా అనీల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించబోతున్నారని తెలుస్తోంది. మరో పది మంది సీనియర్ హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో నటించనున్నారని సమాచారం.

ప్రస్తుతం ‘టైగర్ 3’ షూటింగ్‌ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే ‘నో ఎంట్రీ 2’ సెట్స్‌లో సందడి చేయనున్నాడు సల్లూ భాయ్. ఈ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న సమంత (Samantha) కు.. ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్‌నిస్తుందో చూడాలి మరి. 

Read More: Salman Khan : సల్మాన్ ఖాన్‌తో కలిసి రామ్ చరణ్ నటించేస్తున్నాడు ! ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే ఆ మజాయే వేరు !

 


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!