అబ్బబ్బ‌బ్బా... ఏమ‌న్నా కాంబినేష‌నా...

Updated on May 11, 2022 11:45 PM IST
బాల‌కృష్ణ‌తో బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్టే సినిమా తీయ‌బోతున్నారు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. అఖండ సినిమాలానే త‌ర్వాత సినిమాలు సక్సెస్ అయ్యేలా బాల‌కృష్ణ ప్లాన్ చేస్తున్నారు.

డైలాగుల‌తో థియేట‌ర్ల‌ను ద‌ద్ద‌రిల్లేలా చేసే న‌టుడు నందమూరి బాల‌కృష్ణ‌. అలాగే తనదైన ఫ‌న్‌తో వినోదం పంచే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమా ద‌బ్బిడి దిబ్బిడే అంటున్నారు ఆడియ‌న్స్. బాల‌కృష్ణ‌, అనిల్ కాంబో మూవీ కోసం ఎప్ప‌టినుంచో వెయిట్ చేస్తున్నారు. 

Akhanda Movie Poster

ఆహా ఓటీటీలో "అన్ స్టాపబుల్" అనే ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా.. బాల‌కృష్ణ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఆ షో పెద్ద స‌క్సెస్ అయ్యింది. "అస‌లు బాల‌కృష్ణ ఏంటీ.. హోస్ట్ ఏంటీ" అని ప్రేక్షకులు అనుకున్నా.. ఆయన బ‌రిలోకి దిగితే భారీ క్రేజే వ‌స్తుంద‌ని ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది.  "అన్ స్టాపబుల్" స‌క్సెస్ త‌ర్వాత బాల‌కృష్ణ చేసిన సినిమా "అఖండ‌". బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. 

Balakrishna's Latest Movie Still

బాల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఒక షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్తి చేసుకుంది.
హీరోయిన్‌గా శృతి హాసన్ న‌టిస్తున్నారు. ఫ్యాక్ష‌నిస్ట్, పోలీస్ ఆఫీస‌ర్.. ఈ రెండు పాత్ర‌ల్లో బాల‌య్య ఈ చిత్రంలో అలరించనున్నారు.

వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ పైకి అతి త్వ‌ర‌లో వెళ్ల‌నుంద‌ని.. అందుకు ముహుర్తం కూడా ఫిక్స్ చేశార‌ని టాక్. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!