దిల్ రాజు (Dil Raju) ఇంటికి వార‌సుడొచ్చాడు... మ‌గబిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన రెండో భార్య‌

Updated on Jun 30, 2022 07:56 PM IST
Dil Raju: దిల్ రాజు త‌న కుమారుడుని ఎత్తుకుని ఆనంద ప‌డుతున్న ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.
Dil Raju: దిల్ రాజు త‌న కుమారుడుని ఎత్తుకుని ఆనంద ప‌డుతున్న ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఇంట వార‌సుడొచ్చాడు. దిల్ రాజు రెండో భార్య తేజ‌స్విని జూన్ 29న మగ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. దీంతో దిల్ రాజు ఇంట్లో సంద‌డి నెల‌కొంది. మ‌రోసారి తండ్రైన దిల్ రాజుకు సినీ ప్ర‌ముఖులు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. దిల్‌రాజు, తేజ‌స్వినిల వివాహం మే 10, 2020 తేదిన  జ‌రిగింది. కుటుంబ స‌భ్యులు, కొంత మంది స్నేహితుల స‌మక్షంలో దిల్ రాజు తేజ‌స్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు.

దిల్ రాజు త‌న కుమారుడుని ఎత్తుకుని ఆనంద ప‌డుతున్న ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దిల్ రాజు భార్య‌, కొడుకు ఆరోగ్యంగా ఉన్నార‌ని వైద్యులు తెలిపారు. కూతురు హ‌న్షిత అడ‌గ‌టంతో దిల్‌రాజు రెండో వివాహం చేసుకున్నారు.  

Dil Raju: దిల్‌రాజు, తేజ‌స్వినిల వివాహం 202 డిసెంబ‌ర్ 10 న జ‌రిగింది.

దిల్ సినిమాతో పాపుల‌ర్‌
నిర్మాత దిల్ రాజు (Dil Raju) అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్థాపించి ఎన్నో సినిమాల‌ను నిర్మించారు. దిల్ రాజు అస‌లు పేరు వి. వెంక‌ట ర‌మ‌ణారెడ్డి. దిల్ సినిమా త‌ర్వాత దిల్ రాజుగా పాపుల‌ర్ అయ్యారు. దిల్ రాజు మొద‌టి భార్య అనిత‌. 2017లో అనిత గుండెపోటుతో మ‌ర‌ణించారు. దిల్ రాజు, అనిత‌ల కుమార్తె హ‌న్షిత‌. హ‌న్షిత త‌న త‌ల్లి మ‌ర‌ణించాక‌... తండ్రి దిల్ రాజుకు ద‌గ్గ‌రుండి మ‌రో పెళ్లి చేశారు. హ‌న్షిత తండ్రి బిజినెస్‌ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెడుతూనే.. తెలుగు డిజిట‌ల్ మాధ‌మ్యం ఆహాలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం దిల్ రాజు (Dil Raju) అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన‌ థ్యాంక్యూ సినిమాను నిర్మించారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న ఆర్‌సీ 15 సినిమాను దిల్ రాజే నిర్మిస్తున్నారు. త‌మిళ స్టార్ విజ‌య్‌తో తెలుగు, త‌మిళ్‌భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్న వార‌సుడు సినిమాకు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌మంత న‌టిస్తున్న శాకుంత‌లం సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాల‌తో పాటు పాన్ ఇండియా సినిమాల‌ను దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

Read More : Thank You Movie: లైఫ్‌లో లవ్ స్టోరీలు బాగా నడుస్తున్నాయా? - నాగ చైత‌న్య (Naga Chaitanya)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!