ఇంద్రకీలాద్రిలో ఎఫ్‌3 చిత్ర యూనిట్.. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi), దిల్‌ రాజు ప్రత్యేక పూజలు

Updated on May 26, 2022 02:57 PM IST
అనిల్‌ రావిపూడి  (Anil Ravipudi), దిల్‌ రాజు
అనిల్‌ రావిపూడి (Anil Ravipudi), దిల్‌ రాజు

ఎఫ్‌3 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ విజయవాడ చేరుకుంది. శుక్రవారం సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్‌ కోసం విజయవాడ వచ్చిన చిత్ర యూనిట్ కనకదుర్గ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), నిర్మాత దిల్‌ రాజుకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కనకదుర్గను దర్శించుకున్న తర్వాత వాళ్లను ఆశీర్వదించారు. విజయవాడలో జరిగిన ప్రమోషన్స్‌లో అనిల్‌ రావిపూడి, దిల్‌ రాజుతోపాటు జబర్దస్త్‌ కమెడియన్ గెటప్‌ శీను కూడా ఉన్నాడు.  

ఎఫ్3 సినిమా పేరు చెప్పగానే కామెడీ గుర్తొస్తుంది. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుందని ఆశిస్తారు. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా అదే చెబుతున్నాడు. అయితే కామెడీతో పాటు ఎఫ్3లో కంటెంట్ కూడా ఉంటుందని హామీ ఇస్తున్నాడీ యంగ్‌ టాలెంటెడ్ డైరెక్టర్. ఎఫ్2 సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం, అవగాహన రాహిత్యం లాంటి విషయాలపై చర్చించాడు అనిల్. ఎఫ్3లో మనిషికి మనీ ఎంత అవసరం, మనీ బంధాలు మానవ సంబంధాల్ని ఎలా దెబ్బతీస్తున్నాయనే విషయాన్ని చెప్పబోతున్నాడు. ఎఫ్2లో నాజర్​తో సందేశం అందించిన రావిపూడి, ఎఫ్3లో ఆ బాధ్యతను మురళీశర్మకు అప్పగించాడు.

‘ఎఫ్2 బంపర్ హిట్టయిన వెంటనే మనీ కాన్సెప్ట్‌లో ఎఫ్3  కథ అనుకున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. నేను కాన్సెప్ట్‌ అనుకున్న సమయానికి కరోనా స్టార్ట్ అవ్వలేదు. అయితే, కరోనా వచ్చిన తర్వాత డబ్బు విలువ మరింతగా తెలిసొచ్చింది అందరికీ. మనిషి జీవితంలో మనీ ఎంత వరకు ఇంపార్టెంట్ అనే పాయింట్‌ను నిజాయితీగా తెలియజేసేలా సినిమా చేద్దాం అనిపించింది. ఎఫ్2లో ఎంతగా నవ్వించినా మంచి కంటెంట్ కూడా చెప్పాం. అదే విధంగా ఎఫ్3లో కూడా బాగా నవ్విస్తాం, మనీకి సంబంధించి మంచి కంటెంట్ కూడా చెబుతాం. మనిషి జీవితాన్ని డబ్బు ఎలా రూల్ చేస్తోందనేది వివరిస్తాం’ అని చెప్పాడు అనిల్‌.

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్‌3 సినిమాను కుటుంబ ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూసేందుకు వీలుగా, ఈ సినిమా కోసం టికెట్ రేట్లు పెంచడం లేదు. సాధారణ టికెట్ రేట్లతోనే మొదటి రోజు నుంచి ఈ సినిమా ప్రదర్శించబోతున్నారు. దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాల్ని ఇస్తుందని డైరెక్టర్‌‌ అనిల్‌ రావిపూడితోపాటు (Anil Ravipudi) అందరూ అనుకుంటున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!