‘ఎఫ్‌3’ సినిమా టికెట్‌ రేట్లపై.. నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) కీలక ప్రకటన

Updated on May 22, 2022 01:28 PM IST
‘ఎఫ్‌3’ సినిమా పోస్టర్, దిల్‌ రాజు
‘ఎఫ్‌3’ సినిమా పోస్టర్, దిల్‌ రాజు

విక్టరీ వెంకటేష్ (Venkatesh), వరుణ్‌ తేజ్‌ కాంబోలో వచ్చిన 'ఎఫ్‌ 2' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'ఎఫ్‌ 3' త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ మధ్యకాలంలో రిలీజైన ప్రతి సినిమాకూ టికెట్‌ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి కూడా టికెట్‌ రేట్లు పెంచుతారా? అని ఇండస్ట్రీలో చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 'ఎఫ్‌ 3' సినిమా టికెట్‌ రేట్ల పెంపుపై నిర్మాత దిల్‌ రాజు కీలక వ్యాఖ్యలు చేశాడు.

పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా విడుదలైన ‘ఎఫ్‌-2’.. మూడేళ్ల క్రితం బాక్సాఫీస్‌ వద్ద నవ్వుల సునామీ సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్‌-3’ వస్తోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వేసవి కానుకగా మే 27న విడుదలవుతోంది. ఇటీవలి కాలంలో, స్టార్‌హీరోల చిత్రాలు విడుదలయ్యే సమయంలో.. కొద్ది రోజులకుగాను ప్రత్యేకంగా  టికెట్‌ ధరలు పెంచుతున్న సంగతి తెలిసిందే. దీంతో ‘ఎఫ్‌-3’కి కూడా టికెట్‌ రేట్లు పెంచుతారా? అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీనిపై బుధవారం నిర్మాత దిల్‌రాజు కీలక ప్రకటన చేశారు. 'ఎఫ్‌-3 సినిమాకి టికెట్‌ రేట్లు పెంచడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు. 

దిల్‌రాజు ప్రకటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆనందిస్తున్నారు. డబ్బు, దాని వల్ల వచ్చే అనర్థాలు అనే కాన్సెప్ట్‌తో ‘ఎఫ్‌-3’ తెరకెక్కింది. వెంకీ (Venkatesh), వరుణ్‌ల సరసన తమన్నా, మెహరీన్‌ నటించారు. మురళీ శర్మ, సోనాల్‌ చౌహాన్‌, సునీల్‌, అలీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!