Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ ఎపిసోడ్ లో మెరిసిన రానా, సాయి పల్లవి!

Published on Jun 13, 2022 01:50 PM IST

పూర్తి స్థాయి తెలుగు కంటెంట్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా (Aha OTT). ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తి కలిగించే వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది ఆహా వీడియో. కేవలం సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాక ఆకట్టుకునే గేమ్ షోలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. అందులో భాగంగానే తెలుగులో ఉన్న టాలెంట్ బయటకు తీసేందుకు తెలుగు ఇండియన్ ఐడల్ అనే రియాలిటీ సింగింగ్ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది ఆహా. కాగా, ఈ షో ప్రస్తుతం తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ ఫినాలే నిర్వహించేలా ప్లాన్ చేశారు నిర్వాహకులు.

ఫైనల్ ఎపిసోడ్ కోసం మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) పాటు విరాటపర్వం హీరోహీరోయిన్లు దగ్గుబాటి రానా , సాయి పల్లవి ఈ వేదికపై సందడి చేయబోతుండటం విశేషం. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇస్తూ ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ విడుదల చేసింది ఆహా టీమ్. ఇండియన్ ఐడల్ తెలుగు ఫైనల్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చిరంజీవి రాబోతున్నారు. 

ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లు చేసి ఈ ఎపిసోడ్ షూట్ చేశారట. చిరంజీవి చేతుల మీదుగానే ఇండియన్ ఐడల్ తెలుగు విన్నర్‌కి ట్రోఫీ అందించనున్నారు. తెలుగులో ఇదే తొలి ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) ప్రోగ్రాం కావడంతో విన్నర్ ఎవరవుతారనే దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇక ఈ ఫినాలేలో చిరంజీవి, సాయి పల్లవి సందడి చేస్తారని తెలియడం మరింత ఆత్రుత పెంచేసింది. కాగా, ఈ ఎపిసోడ్ జూన్ 17న ఆహాలో ప్రసారం కానుంది. 

ఇక ఈ షో కోసం వారం వారం ఎవరో ఒక అతిథులను షో కోసం ఆహ్వానిస్తుండగా, ఆ ఎపిసోడ్ కు నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఛీఫ్ గెస్ట్‌గా విచ్చేశారు. ఇక సెమీ ఫైనల్స్ రౌండ్ లో బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి గాయకులను అభినందించారు. అందులో లాలస అనే గాయని ఎలిమినేట్ అవ్వగా మిగతా ఐదుగురు ఫైనల్స్ కు వెళ్ళారు. 

ఇదిలా ఉంటే.. దగ్గుబాటి రానా (Rana), నాచురల్ క్వీన్ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా రూపొందిన కొత్త సినిమా 'విరాటపర్వం' (Virata Parvam). వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. కరోనా కారణంగా వాయిదాల పర్వం కొనసాగి చివరకు జూన్ 17న ఈ విరాటపర్వం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read More: Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ లో సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో వైరల్!