కూతురు కోసం చిరంజీవి (Chiranjeevi) సినిమా

Updated on Apr 27, 2022 05:25 PM IST
సుస్మితతో చిరంజీవి (Chiranjeevi)
సుస్మితతో చిరంజీవి (Chiranjeevi)

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ చాలామందికి హీరోనే. సమాజ సేవలో ముందుండే చిరు అభిమానుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అటువంటి వ్యక్తి తన కూతురుకు మెగా గిఫ్ట్‌ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల వరుసగా సినిమాలు ఓకే చేస్తూ స్పీడ్‌ పెంచిన చిరు అభిమానుల కోసం సినిమాల మీద సినిమాలు చేయనున్నట్టు వెల్లడిస్తున్నారు. ఇక, తన కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణ సారధ్యంలో సినిమా చేయనున్నట్టు సమాచారం.

ఈ మధ్యకాలంలో మెగాస్టార్‌‌ నటించిన సినిమాలలో దాదాపు అన్నింటికీ కాస్ట్యూమ్ డిజైనర్‌‌గా పనిచేసింది సుస్మిత. అంతేకాదు, ‘షూటౌట్‌ ఎట్‌ అలైర్’ అనే వెబ్‌సిరీస్ నిర్మించి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మరిన్ని ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. ఇటీవల గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ సంస్ధలో మెగాస్టార్‌‌ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. మెగాస్టార్‌‌తో సినిమా అంటే ఆయన రెమ్మునరేషన్‌కే కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.

కూతురు కోసం చిరంజీవి ఫ్రీగా సినిమా చేయనున్నారని సమాచారం.కూతురుకి గిఫ్ట్​గా సినిమా చేయబోతున్నట్టు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. డైరెక్టర్‌‌ ఎవరనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.

ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ఆ తర్వాత భోళాశంకర్, గాడ్‌ఫాదర్, వాల్తేర్ వీరయ్య తదితర సినిమాలు ప్రస్తుతం లైన్‌లో ఉన్నాయి. వీటి తర్వాత కూతురు సుస్మిత సినిమా ఉండనుందని సమాచారం. ఇక, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్‌‌స్టార్‌‌ రాం చరణ్‌ నటించిన ఆచార్య సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!