సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ (Celebrity Cricket Carnival) ఈవెంట్ లో చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు..!

Published on Aug 22, 2022 08:00 PM IST

సెప్టెంబర్‌ 24న అమెరికాలోని డల్లాస్‌లో సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ జరగనుంది. ఈ నేప‌థ్యంలో హైదరాబాద్ లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో సెల‌బ్రిటీ క్రికెట్ కార్నివాల్ (Celebrity Cricket Carnival) ట్రోఫీ, జెర్సీని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆవిష్క‌రించారు.

అమెరికాలోని ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైనర్స్ సంస్థను సపోర్ట్ చేయడానికి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్ ముందుకు వచ్చారు. మరో వైపు ఇదే కార్యక్రమంలో చిరంజీవి (Chiranjeevi Birthday Celebrations) పుట్టిన రోజుల వేడుకులను ముందుగానే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతో మిగతా సెలబ్రిటీలందరూ కలిసి మెగా అనే పేర్లతో తయారు చేసిన కేక్ ను కట్ చేయించారు.   

అమెరికాలోని డల్లాస్‌లో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA)తో సెప్టెంబర్ 24న డే & నైట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (CCC) ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్ (Prakash Raj) ముఖ్య అతిథులుగా, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్, తమన్, సుధీర్ బాబుతోపాటు జట్టు సభ్యులు, ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైనర్స్ CEO రాజీవ్, సభ్యులు పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా విజయవంతం అయినప్పుడు కంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడు కలిగే సంతృప్తి చాలా గొప్పదన్నారు. ఒక ఉద్యమంలా బ్లడ్‌ బ్యాంక్‌ (Chiranjeevi Blood Bank) స్థాపించడానికి కారణం కూడా అదే. మనకు ఎంతో ఇచ్చిన ప్రేక్షకులకు తిరిగి ఏమిస్తున్నామని ఉద్భవించిన ప్రశ్నలో నుంచి వచ్చిన ఆలోచనే బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు అన్నారు.

Read More: HBD Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి జీవితంలోని టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలివే !