‘విరాటపర్వం’లో ప్రియమణి పాత్ర కీలకం.. బర్త్‌డే విషెస్‌ చెబుతూ రానా (Rana Daggubati) ట్వీట్

Updated on Jun 04, 2022 05:31 PM IST
విరాట పర్వం సినిమాలో రానా దగ్గుబాటి (Rana Daggubati)  , ప్రియమణి
విరాట పర్వం సినిమాలో రానా దగ్గుబాటి (Rana Daggubati) , ప్రియమణి

దగ్గుబాటి రానా (Rana Daggubati), సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'విరాటపర్వం'. ద‌గ్గుబాటి సురేష్‌ బాబు సమర్పణలో శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వరా సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించాడు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 17న విడుదల కానుంది. ఈ సినిమాలో వెన్నెల అనే క్యారెక్టర్‌‌లో సాయిపల్లవి నటిస్తుండగా, రవి శంకర్ అలియాస్ రవన్న పాత్రలో రానా దగ్గుబాటి కామ్రేడ్‌గా చేస్తున్నాడు. కామ్రేడ్‌ భారతక్క పాత్రలో ప్రియమణి అలరించనుంది. జూన్‌ 3వ తేదీన ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా విషెస్‌ చెప్పాడు రానా. 

ఇప్పటికే రిలీజ్‌ చేసిన ప్రియమణి 'కామ్రేడ్ భారతక్క'గా నటిస్తున్న పోస్టర్‌ను పంచుకుంటూ ట్వీట్‌ చేశాడు రానా. ఈ ట్వీట్‌లో 'మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్‌ రివల్యూషన్‌లో స్టూడెంట్స్‌ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో కామ్రేడ్‌ భారతక్క కూడా అంతే కీలకం' అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నగాదారిలో పాటను రిలీజ్‌ చేశారు. సురేశ్‌ బొబ్బిలి సంగీత సారథ్యంలో ఫోక్‌ సింగర్‌ వరం పాడిన పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 

విరాటపర్వం సినిమా పోస్టర్

రానా (Rana Daggubati) నటించిన విరాట ప‌ర్వం  సినిమా చాలా రోజుల క్రితమే షూటింగ్  పూర్తయినా.. విడుద‌ల‌కు అడ్డంకులు ఎదుర‌య్యాయి. క‌రోనా కారణంగా సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఆ త‌ర్వాత థియేట‌ర్లలో ఆర్‌‌ఆర్‌‌ఆర్, కేజీఎఫ్ చాప్టర్2 సినిమాల కార‌ణంగా విరాట పర్వం సినిమాను రిలీజ్‌ చేయడానికి టైం తీసుకుంది చిత్ర యూనిట్. రానా కామ్రేడ్‌ రవన్నగా నటించిన విరాట ప‌ర్వం సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 17వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచింది కూడా. ఈ క్రమంలో వరుసగా అప్‌డేట్‌లు ఇస్తూ సినిమాపై మంచి అభిప్రాయం కలిగి, థియేటర్లలో సినిమా చూడడానికి ప్రేక్షకులు వచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు విరాట పర్వం సినిమా మేకర్స్.

Read More:  రానా నాయుడు సిరీస్‌తో కొత్త ట్రెండ్‌‌కు శ్రీకారం చుట్టిన బాబాయ్ - అబ్బాయ్ .. ఫోటోలు వైరల్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!