Vijay Deverakonda: ఫైనల్ సాంగ్ చిత్రీకరణకు విజయ్‌ దేవరకొండ ‘లైగర్’ చిత్ర యూనిట్.. ప్రమోషన్స్‌కు ప్లాన్ రెడీ

Updated on Jun 24, 2022 05:45 PM IST
చార్మి, విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్‌
చార్మి, విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్‌

పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). డియర్ కామ్రేడ్, గీతా గోవిందం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యాడు. అర్జున రెడ్డి సినిమాతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ పెంచుకున్న విజయ్‌.. డాషింగ్ డైరెక్టర్‌‌ పూరీ జగన్నాథ్‌తో కలిసి ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు.

బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తున్న 'లైగర్' సినిమాలో విజయ్ ఫైటర్‌‌గా కనిపించనున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన విడుదల చేయబోతున్నట్టుగా చిత్ర యూనిట్‌ ఇప్పటికే వెల్లడించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లైగర్‌‌ సినిమా ఫైనల్ సాంగ్ షూట్ చేయడానికి పూరీ టీమ్ రెడీ అవుతోందని టాక్. ఇప్పటికే సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒక్క సాంగ్ మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. బ్యాలెన్స్ ఉన్న సాంగ్‌ను కూడా పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది.

ఈ సాంగ్ చిత్రీకరణతో లైగర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం. పాట చిత్రీకరణ పూర్తయిన తర్వాత 'లైగర్' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్లాన్ రెడీ చేసుకున్నారని తెలుస్తోంది. లైగర్‌‌ సినిమాను తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలోనూ రిలీజ్ చేయనున్నారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్లలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

లైగర్ సినిమా పోస్టర్

ప్రమోషన్స్‌కు ఎక్కువ సమయం..

దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కి, హీరోగా విజయ్ దేవరకొండకు 'లైగర్' సినిమా మొదటి పాన్ ఇండియా సినిమా. అందుకే  ప్రమోషన్స్‌కు కొంచెం ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. సుమారు ఆరు వారాల ముందు నుంచే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్‌ చేయబోతున్నట్టు సమాచారం.

ఇక లైగర్‌‌ సినిమాలో మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పూరీ జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లైగర్‌‌ సినిమా తర్వాత పూరి, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్‌లో మరో సినిమా కూడా తెరకెక్కుతోంది. 'జనగణమన' టైటిల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొదలై కొనసాగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ‘జనగణమన’ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్‌గానే రిలీజ్ కానుంది.

Read More : కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda )

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!