కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda )

Published on Apr 21, 2022 05:00 PM IST

అర్జున్‌రెడ్డి సినిమాతో యూత్‌లో సూపర్ క్రేజ్ సాధించిన విజయ్ దేవరకొండ.. తాజాగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌తో ‘లైగర్‌‌’ సినిమా చేశాడు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీపై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా వ్యాప్తితోపాటు ఇతర కారణాల వల్ల లైగర్ షూటింగ్‌ ఆలస్యం అయ్యింది.దీంతో విజయ్‌ ఇప్పుడు స్పీడ్‌ పెంచాడా అన్నట్టుగా ఉంది. మరో కొత్త సినిమా ప్రారంభించేశాడు ఈ యంగ్‌ హీరో. పెళ్లిచూపులు, డియర్ కామ్రేడ్, టాక్సీవాలా, అర్జున్‌రెడ్డి, గీత గోవిందం తదితర చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ప్రస్తుతం కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెళ్లి కొడుకు గెటప్‌లో వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు