విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), సమంతల ‘ఖుషి’ సినిమాలో లిప్‌లాక్‌ సీన్లు? నిజమెంతో డైరెక్టరే తేల్చాలి

Updated on May 24, 2022 10:21 AM IST
విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), సమంత
విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), సమంత

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్‌ హీరోయిన్‌ సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లవ్‌ స్టోరీ 'ఖుషి'. ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ అయిన శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్‌-– సమంత జంటగా నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. లవ్‌స్టోరీ కావడంతో ఖుషి మూవీలో విజయ్‌, -సామ్‌ మధ్య ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండే చాన్స్‌ ఉందని ప్రచారం జరుగుతోంది. కథ డిమాండ్‌ చేయడంతోనే డైరెక్టర్‌ శివ ముద్దు సీన్లు పెట్టనునారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.  

సినిమా కథలో ముద్దు సన్నివేశాలకు ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్న హీరోహీరోయిన్లు లిప్‌లాక్‌ సీన్లలో నటించడానికి ఒప్పుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అనేదానికి క్లారిటీ ఇవ్వాల్సింది డైరెక్టర్‌ మాత్రమే. లేదా సినిమా విడుదలయ్యాక చూసి తెలుసుకోవలసిందే. కాగా, కశ్మీర్‌ పరిసర ప్రాంతాల్లో కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదలైంది. ఫస్ట్‌ లుక్‌లో విజయ్‌ స్టైలిష్‌గా, సమంత సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతిగా కనిపించారు.

ఇక, విజయ్‌ దేవరకొండ – పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘లైగర్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక తన తదుపరి సినిమా షూటింగ్‌లో విజయ్‌ బిజీగా ఉన్నాడు. సమంతతో సినిమా చేస్తున్న విజయ్ (Vijay Devarakonda).. ఇటీవల జరిగిన సమంత బర్త్‌డే రోజు ఆమెను సర్‌‌ప్రైజ్‌ చేస్తూ విషెస్ చెప్పాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!